- Advertisement -

బ్రహ్మానందాన్ని మించిన కామెడీ చేస్తున్నారే…

- Advertisement -

ఏపీ టీడీపీ ఎంపీలు బ్ర‌హ్మానందాన్ని మించిన కామెడీ చేస్తున్నారు. క‌డ‌ప ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అంటూ అదే పార్టీకి చెందిన రాజ్య స‌భ ఎంపీ సీఎం ర‌మేష్ నిరాహార దీక్ష‌చేస్తుంటే తెలుగు తమ్ముళ్లు చేసిన అప‌హాస్యం అంతా ఇంతా కాదు మీరూ చూసేయండి అంటూ నెటిజ‌న్లు ప‌లు వీడియాల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా విశాఖ రైల్వే జోన్ కోసం టీడీపీ ఎంపీలు ఒక్క రోజు నిరాహార దీక్ష చేప‌ట్టారు. ఆ దీక్ష‌పై సెటైర్లు ప‌డుతున్నాయి.

నిజం చెప్పాలంటే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష అనేది డిమాండ్లు నెరవేర్చేందుకు నాయ‌కుడు ఉప‌యోగించుకునే శ‌క్తి వంత‌మైన ఆయుధం. వారిలో మహాత్మా గాంధీ, పోట్టి శ్రీరాములు కూడా ఉన్నారు. క‌లియుగంలో టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షులు కేసీఆర్ కూడా ఉన్నారు.

ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో భాగంగా కేసీఆర్ తాను మ‌ర‌ణించే వ‌ర‌కు ప‌చ్చిమంచినీళ్లు ముట్టుకోన‌ని ఆమ‌ర‌ణ‌దీక్ష చేప‌ట్టారు. ఆ దీక్ష దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. అప్పుడే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది.

అటువంటి శ‌క్తి వంతమైన ఆయుదాన్ని టీడీపీ నేత‌లు వ్యాయామంగా మార్చేశారు. క‌డ‌ప ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అని , క‌డ‌ప‌లో ఉక్కు క‌ర్మ‌గారాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తు ఎంపీ సీఎం ర‌మేష్ 11రోజుల ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌చేప‌ట్టారు. కానీ లాభం లేక‌పోయింది. ఆమ‌ర‌ణ దీక్ష చేస్తున్న సీఎం ర‌మేష్ ఆరోగ్యం పై ఎటువంటి ప్ర‌భావాన్ని చూప‌లేక‌పోయింది.

దీంతో సీఎం ర‌మేష్ ఆమ‌ర‌ణ నిరాహారా దీక్ష‌ను గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ లో న‌మోదు చేయాల‌ని బీజేపీ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. డ‌యాబెటిక్ బాధితుడైన సీఎం ర‌మేష్ ఎటువంటి బరువు కోల్పోకుండా 11 రోజులు బ్రతికి బయటప‌డ్డార‌ని అన్నారు.

అత‌ని ఆరోగ్యం బాగుప‌డాల‌ని ఆమ‌ర‌ణ దీక్ష‌ చేయ‌డం చాలా మంచిది. కానీ న‌కిలీ నిరాహార‌దీక్ష‌ల‌తో ప్ర‌జ‌ల్లోని న‌మ్మ‌కాన్ని కోల్పోతార‌ని సూచించారు. వాస్తవానికి, ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్పదమయ్యాయి. పార్టీ నాయకులు డిమాండ్లను సాధించడానికి ఆయుధంలా కాకుండా బ‌రువు త‌గ్గించేలా ఆయుధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

అయితే ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు టీడీపీ ఎంపీలు ఒక్క రోజు ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగారు. వైజాగ్ లోని ప్ర‌త్యేక రైల్వే జోన్ కోసం ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టారు. దీంతో టీడీపీ ఎంపీలు డిమాండ్ల కోసం కాకుండా బ‌రువు త‌గ్గేందుకే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌ అంటున్నారు నెటిజ‌న్లు…, త‌మ‌ని తాము ఎగ‌తాళి చేసేలా.. ఎంపీల బ‌రువుత‌గ్గ‌డం వ్యాయామంగా మార్చుకుంటుంన్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -