- Advertisement -

వేట‌గాడు సినిమాలో జ‌య‌మాలిని టైపు…

- Advertisement -

ఏపీలో అధికార పార్టీ టీడీపీ రాజ‌కీయ భ‌విష్య‌త్తు అంధ‌కారంలో మునిగితేలుతున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ ఎలా ఉన్నా ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ప‌రిస్థితి ఇంకా దారుణంగా ఉన్న‌ట్లు గుసగుస‌లు వినిపిస్తున్నాయి. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే వేట‌గాడు సినిమాలో జ‌య‌మాలిని టైపు. పుట్టింటోళ్లు త‌రిమేశారు… క‌ట్టుకున్నోడు వ‌దిలేశాడు అన్న చందంగా త‌యారైన‌ట్లుంది.

గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు బీజేపీ – ప‌వ‌న్ మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకొని అధికార ప‌గ్గాలు చేప‌ట్టారు. అదే ఊపు మీద వాగ్ధానాలు, ఫిరాయింపుల్ని భారీగా ప్రోత్స‌హించారు. అంతే ఒక్క‌దెబ్బ‌తో ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ నేత‌లు టీడీపీ చేరారు. చేరిన‌వారు ఏదో ఒక ప్ర‌తిఫ‌లం ఆశించ‌కుండా ఉండ‌రు క‌దా.

అంతే మోడీతో స్నేహం గా ఉన్న చంద్ర‌బాబు తెలంగాణాలో ఏ విధంగా జిల్లాల్ని పెంచారో.. ఏపీలో కూడా అదే విధంగా జిల్లాల్ని పెంచి..కొత్త గా ఏర్పాటు చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని అనుకున్నారు. కానీ అనుకున్న‌ది జ‌రిగితే అది జీవితం ఎందుకు అవుతుంది.

త్వ‌ర‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు రాబోతున్నాయి. దీంతో ఆశావాహులు త‌మ‌కు టికెట్ కావాలంటే, త‌మ‌కు టికెట్ కావాల‌ని సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. ఈ సంప్ర‌దింపులే చంద్ర‌బాబు కు తల‌నొప్పులు తెచ్చిపెడుతోంది. భారీ ఎత్తున ఫిరాయింపుల్ని భారీగా ప్రోత్స‌హించ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసిన కొంత‌మంది నేత‌లకు బ్యాడ్ న్యూస్ కాగా, మ‌రికొంద‌రు ప‌క్క‌చూపులు చూస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయ‌క‌పోవ‌డంతో ఆశావాహులు చంద్ర‌బాబు చుట్టూ ప్ర‌దక్షిణాలు చేస్తున్నారు.

దీంతో ఎవ‌రికి టికెట్ ఇవ్వ‌లో, ఎవ‌రికి ఇవ్వాలో త‌ల‌లు ప‌ట్టుకున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఫిరాయింపుల‌కు పెద్ద‌పీఠ‌వేయాలా ..లేదంటే సొంత‌పార్టీ ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇవ్వాలా అనే అంశంపై డిస్క‌ష‌న్స్ న‌డుస్తోంద‌ని టాక్ వినిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -