ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) 100 బాల్ ఫార్మాట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ ఫార్మెట్లో నేను భాగ స్వామిని కాలేనని తెలిపారు. గేమ్ పూర్తిగా కమర్షియల్ అయిపోయిందని, దీనివల్ల క్రికెట్లో నాణ్యత దెబ్బతింటున్నదని అతనన్నాడు. 100 బాల్స్ ఫార్మాట్ అంటూ కొత్తగా తెరపైకి వస్తున్న ప్రతిపాదనలను కూడా కోహ్లి తప్పుబట్టాడు. టెస్ట్ క్రికెట్‌ను కాపాడాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు విజ్ఞప్తి చేశాడు.
నేను ఆవేశంతో మాట్లాడటం లేదు, కానీ కొన్ని సార్లు విపరీతమైన క్రికెట్ ఆడటంతో విసుగు వస్తుందన్నారు. వాణిజ్య అంశాలు ఆటను దెబ్బతీయడం నాకు బాధను కలిగిస్తోంది. ప్రస్తుతం నాకు ఎలాంటి కొత్త ఫార్మాట్ ఆడాలని లేదు. ఈసీబీలాంటి బోర్డు కొత్త ఫార్మాట్‌ను తెరపైకి తెస్తుండటం ఆసక్తి రేపుతున్నా.. నాకు మాత్రం ఈ కొత్త ఫార్మాట్‌పై ఆసక్తి లేదు. ఆ ఫార్మాట్‌ను లాంచ్ చేయబోయే జట్టులో నేను ఉండలేనని తెలిపారు.
ఓ టెస్ట్ ప్లేయర్‌గా ఏ కొత్త ఫార్మాట్‌కు మారాలని అనుకోవడం లేదు. నేను ఐపీఎల్ ఆడటాని, బీబీఎల్ చూడటాన్ని ఆస్వాదిస్తాను. అన్నీ లీగ్‌లకు మద్దతిస్తాను కాని.. ఇలాంటి ప్రయోగాలకు కాదు.’ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. క్రికెట్ బోర్డులు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోతే క్రికెట్ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించాడు.
