తెలుగు దేశం పార్టీ తెలంగాణా లో మూడు చెరువుల నీళ్ళు తాగడానికి కెసిఆర్ – కేటీ ఆర్ లు ఎంత ముఖ్యులో అలాగే చంద్రబాబు గారి పుత్ర రత్నం చిన్న బాబు లోకేష్ కూడా అంతే ముఖ్యం అని చెప్పాలి. జాతీయ పార్టీ లో చురుకైన పాత్ర పోషించే లాగా లోకేష్ ముందుకు వెళ్ళాలి అని తెలంగాణా బాధ్యతలు అతనికి అప్ప జెప్తే మునిగిపోయిన నౌక ని ఇంకా ముంచేసి చక్కా ఒచ్చాడు. అయినా బాబు గారికి కేంద్రం లో లోకేష్ కి మంచి ప్లేస్ ఇవ్వాలి అనే ఆలోచన చావడం లేదు.
మొన్నటి వరకూ అతనికి కేంద్ర క్యాబినెట్ పదవి దాదాపు ఖాయం అన్న వార్తలు రాగా ఇప్పుడు లోకేష్ విషయం లో ఒక ఆసక్తికర వార్త బయటకి ఒచ్చింది. లోకేష్ కు మంత్రి పదవికి ఇప్పుడు తొందరమేమి లేదని..తరువాత చూద్దాంలే అని చంద్రబాబు మంత్రులతో చెప్పినట్టు సమాచారం. లోకేష్ కు మంత్రి పదవి ఖాయం అనుకుంటున్న సమయంలో మంత్రి పదవిపై చంద్రబాబు ఎందుకని వెనక్కి తగ్గారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది అంటున్నారు.
తెలుగుదేశం లో ఇప్పటికే వలసలు ఎక్కువగా ఉన్నాయి. బాబు ఒచ్చినవారు అందరికీ ఎదో ఒక పదవి ఇస్తాను అని హామీల మీద హామీలు గుమ్మరిస్తున్నారు. బాబు హామీల వలెనే వలసలు ఇంకా పెరుగుతున్నాయి. వలసలు పెరగడంతో.. పదవులు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సమయంలో లోకేష్ కు మంత్రి పదవి ఇస్తే.. వలస వచ్చిన నేతలలో ఎక్కడ అసంతృప్తి వస్తుందో అని చెప్పి బాబు లోకేష్ కు మంత్రిపదవిని పెండింగ్ లో పెట్టారని సమాచారం.
