జగన్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని నిమిషాల వ్యవధి నుంచే నిందితుడు జగన్ అభిమానే అని పచ్చ బ్యాచ్ మొత్తం ఎంతగా డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నా నిజాలు మాత్రం జనాలను చేరకుండా ఆగడం లేదు. ఆల్రెడీ టిడిపి నాయకుడు హర్షవర్ధన్ గురించి అందరికీ తెలిసిపోయింది. స్వయంగా లోకేష్‌నే హర్షవర్ధన్ షాప్ ఓపెనింగ్‌కి ముఖ్యఅతిథిగా వెళ్ళిన వ్యవహారం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పేసింది. ఇక ఇప్పుడు టిడిపిలోనే సీనియర్ మోస్ట్ నాయకుడి పేరు కూడా ఈ వ్యవహారంలో వినిపిస్తోంది.
చంద్రబాబుతో సహా టిడిపి నాయకలు అందరూ కూడా విమానాశ్రయం మా పరిధిలోది కాదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆరు నెలల క్రితం వరకూ విమానయాన శాఖ మంత్రిగా ఉన్న నాయకుడు ఎవరో చంద్రబాబు మరిచిపోయాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరిచిపోయారా? ఏ పార్టీ సీనియర్ నాయకుడు విమానయానశాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఈ టిడిపి నాయకుడు హర్షవర్ధన్ విశాఖా విమానాశ్రయంలో బిజినెస్ కాంటాక్ట్స్ తెచ్చుకున్నాడో ప్రజలు గుర్తించలేరా? వైఎస్ జగన్ పాదయాత్ర మొదలు పెట్టిన రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేశారు. ఆ నాటి నుంచే జగన్‌ని హతమార్చాలనుకున్న ప్రత్యర్థులు కూడా వ్యూహరచన చేశారా? గరుడ పురాణాలు వినిపించిన టైం కూడా అదే. మొత్తంగా వాళ్ళే వ్యూహ రచన చేసి……..వాళ్ళే వ్యూహాన్ని అమలు చేసి…….అంతా కూడా గరుడ పురాణం అకౌంట్లో వేస్తూ కేంద్రాన్ని బాధ్యులను చేయాలని చూశారా? ఈ ప్రశ్నలను లోతుగా ఆలోచిస్తే హత్యా రాజకీయం మిస్టరీ ఎవ్వరికైనా ఈజీగానే అర్థమవుతుంది. అధికారం కోసం తండ్రికే ద్రోహం చేసిన కొడుకులు, పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి, ఆ వేధనతో ఆయన చనిపోయేలా చేసిన చరిత్ర ఉన్న నాయకుడి విలువల గురించి కొత్తగా ఎవరైనా చెప్పాలా తెలుగు ప్రజలకు?
అలాగే 11 పేజీల లేఖ ఒక్క మడత కూడా లేకుండా ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు అని డిజిపి, టిడిపి నాయకులు చెప్తున్న కథలు నమ్మేవిధంగా ఉన్నాయా? ఈ రోజు నిందితుడు శ్రీనివాసరావుకు చెందిన టిడిపి సభ్యత్వ కార్డ్ కూడా బయటకొచ్చింది. అధికారం కోసం ఎంతకైనా తెగించేది ఎవరో…………రైతు రుణమాఫీ నేను కూడా చేసేస్తా అన్న మాట అంటే సిఎం కుర్చీ దక్కే అవకాశం ఉన్నా కూడా అధికారం కంటే విలువలు, విశ్వసనీయత, వ్యక్తిత్వం ముఖ్యం అని నిబద్ధతగా ఉన్న నాయకుడు ఎవరో తెలుగు ప్రజలకు తెలియదా? తనపై హత్యాయత్నం జరిగినప్పటికీ ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వైకాపా శ్రేణులు, నాయకులు సంయమనం పాటించేలా చేసింది ఎవరు? ఆందోళనలు చేసి రాష్ట్రపతి పాలన వచ్చేలా చేయాలని చూశారు అన్న చంద్రబాబు……రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క హింసాత్మక ఘటన జరిగిందేమో చూపించగలరా?
నటనకు, అబద్ధాలకు, నిజాయితీకు, నిబద్ధతకు తేడా తెలుసుకునే తెలివితేటలు తెలుగు ప్రజలకు లేవు అని……తాము చెప్పిందే గుడ్డిగా నమ్ముతారు అని రాక్షస రాజకీయాలు చేస్తున్న వారు ఎవరో అర్థం చేసుకోలేనంత అమాయక స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారా?
