కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై డిప్యూటీ సీఎం కేయీ కృష్ణమూర్తి ఆవేశంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి అందరికీ గుర్తే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకీ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అలాంటి టీడీపీ ఆ పార్టీతో జత కట్టడం ఆసాధ్య మన్నారు. ఇంకొకడుగు ముందుకేసి అ దే జరిగితే నేను ఉరివేసుకుంట అంటూ మహా గొప్పగా చెప్పారు. కాని కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది.
సరిగ్గా 3 నెలల కిందట టీడీపీ సీనియర్ నేత, మంత్రి కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలివి. పాపం, చంద్రబాబు సంగతి తెలిసి కూడా అప్పట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు చూస్తే చంద్రబాబు స్వయంగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీకి శాలువా కప్పారు. దీంతో కేఈ పై సోషియల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
సర్.. బాబు సంగతి తెలిసి కూడా ఎందుకు నోరు జారారంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. దయచేసి అఘాయిత్యానికి పాల్పడొద్దంటూ మరికొందరు చురకలు అంటిస్తున్నారు. బాబుతో కలిసి ఢిల్లీ వెళ్లకుండా మంచి పని చేశారంటూ మరికొందరు సెటైర్లు వేశారు. ఇలా ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో కామెడీ పీస్ గా మారిపోయారు కేఈ.
