తెలంగాణాలో జరగనున్న ఎన్నికల్లో అధికారపార్ట టీఆర్ఎస్, మహాకూటమి హోరా హోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దూసుకు పోతుంటే మహాకూటమి కూడా దూకుడు పెంచింది.కాంగ్రెస్ అథిరథ మహారథులందరూ ప్రచారానికి రప్పిస్తున్నారు. ఎంత మంది నాయకులు వచ్చి ప్రచారం చేసినా అధికారం టీఆర్ఎస్ దేనని మరో సారి టైమ్స్ నౌ సర్వే తేటతెల్లం చేసింది.

తాజాగా నిర్వహించిన సర్వేలో తెలంగాణా ప్రజలు కేసీఆర్‌కే మరో సారి పట్టం కట్టనున్నారని ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ 70 సీట్లు, కాంగ్రెస్ 31 సీట్లను, టీడీపీ 2, ఎమ్‌ఐఎమ్ 8, బీజేపీ 3, ఇతరులు 5 సీట్లు గెలుచుకోనున్నట్లు సర్వే ప్రకటించింది.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలని 45.27 శాతం ప్రజలు కోరుకోగా… ఉత్తమ్ కుమార్ రెడ్డికి 30.55, కోదండరాంకు 3.37 శాతం మద్దతు లభించింది. ఇక.. టీఆర్‌ఎస్‌కు 37.55 శాతం ఓట్లు వస్తాయని.. కాంగ్రెస్‌కు 27.98 శాతం, టీడీపీకి 5.66, ఎమ్‌ఐఎమ్‌కు 4.10 శాతం, బీజేపీకి 11 శాతం, ఇతరులకు 13.71 శాతమని సర్వే వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్‌ఎస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించిందని 45.73 శాతం ప్రజలు తెలుపగా.. కాంగ్రెస్ వైపు 32.90 శాతం ప్రజలు ఉన్నారని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
2014 లో టీఆర్‌ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 34.30 కాగా.. ఈసారి 37.55 శాతం రానున్నట్టు సర్వే తెలిపింది. అంటే 3.25 శాతం ఓట్ల శాతం టీఆర్‌ఎస్‌కు పెరిగింది. టీడీపీకి 2014 లో 14.70 శాతం ఓట్లు రాగా.. ఇప్పుడు 5.66 శాతం ఓట్లే వచ్చాయని.. అంటే టీడీపీ ఓట్ల శాతం 9.04 శాతం తగ్గుతోంది. దీన్ని బట్టి తెలంగాణా ప్రజలు మహాకూటమిని ఎప్పుడో తిరస్కరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కూటమికి మరో సారి నిరాశ తప్పదేమో…?
