జీఎస్ఎల్వీ ఎఫ్11 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సాయంత్రం 4:10 నిమిషాలకు నింగిలోకి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు.జీఎస్ఎల్వీ-11 రాకెట్ జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి వాహకనౌక ప్రవేశపెట్టనుంది. నెలరోజుల తర్వాత ఇస్రో మూడో ప్రయోగం చేపట్టింది. ఎయిర్ ఫోర్స్ సమాచార వ్యవస్థ కోసం పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో ఇస్రో ఈ శాటిలైట్‌ను రూపొందించింది.
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ -11 రాకెట్ ద్వారా క్షేమంగా గమ్యం చేరిన తరువాత జీశాట్ 7-ఏ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు సమాచార రంగానికి సంబంధించి సేవలను అందించనుంది. ఇప్పటికే ఇస్రో జీఎస్‌ఎల్‌వీ , పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా పలు సమాచార ఉప గ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది.
మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా 2,250 కిలోల బరువున్న జీశాట్-7ఏ ఉప్రగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడతారు.
దీని ద్వారా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సమాచార వ్యవస్థకు సేవలందిస్తారు. 2013లో ప్రయోగించిన జీశాట్-7 గడువు ముగియడంతో దాని స్థానంలో జీశాట్-7ఎ ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలోకి పంపుతోంది. ఈ ఉపగ్రహం ఎనిమిది సంవత్సరాల పాటు సేవలు అందించనుంది.
