తెలంగాణ ఎన్నికల ఫలితాలు తరువాత బాగా వినిపించింది పేరు బండ్ల గణేష్. ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు బండ్ల గణేష్. ఎన్నికలలో తనకు సీటు వస్తుందనే నమ్మకంతో పలు టీవీ చర్చ కార్యక్రమాలలో పాల్గొని తన మాటలతో ప్రత్యర్థులపై దాడి చేశాడు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహకూటమి అధికారంలోకి వస్తుందని, అలా జరగకపోతే తాను ఆక్సా బ్లేడ్‌తో తన పీక కోసుకుంటానని మీడియా సాక్షిగా ప్రగల్భాలు పలికాడు.
అయితే సీన్ రివర్స్ అయింది. బండ్లకు సీటు ఇవ్వకపోగా ,ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఆక్సా బ్లేడ్‌తో మీడియా వారు బండ్ల గణేష్ కోసం వెతికారు.తాజాగా ఈ ఇష్యూపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో నాగబాబు బండ్ల గణేష్ గురించి మాట్లాడారు. బండ్ల గణేష్ రాజకీయాల గురించి పక్కన పెడితే అతను మాట్లాడుతుంటే మాత్రం అలాగే చూడాలనిపిస్తుంది.గణేష్ ఇంటర్య్వూలలో చేసే కామెడీ సినిమాలలో చేసి ఉంటే ,పెద్ద కమెడియన్ అయ్యే వాడని తెలిపారు నాగబాబు.
బండ్ల గణేష్‌కి పీక కోసుకునేంత సీన్ లేదని నాకు ముందే తెలుసు.. ‘ఎన్నిక ముందు వంద అంటామండి’ అని అంటారనే విషయం కూడా తెలుసునని చెప్పుకొచ్చారు నాగబాబు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ వంటి నాయకులు ప్రసంగాలు విన్న మాకు, బండ్ల గణేష్ ఇంటర్య్వూలు చూస్తే కాస్తా రిలీఫ్‌గా అనిపిస్తుందని , కామెడీ పంచే విషయంలో మాత్రం అతడిని మెచ్చుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
