కన్నడ సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. బుధవారం అర్థరాత్రి ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో 60 చోట్ల అధికారులు ఈ దాడులు జరిపారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నిర్మాతైన రాక్ లైన్ వెంకటేష్, సీఎం సతీమణి సినీ నటి రాధిక ఇళ్లలో సోదాలు చేసినట్లు సమాచారం. ఇలా సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ శాఖ దాడులు చేయడంతో కన్నడ సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
రాక్ లైన్ వెంకటేష్ నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఇలానే పలువురు సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు నిర్వహించింది కర్ణాటక ప్రభుత్వం.తాజాగా మరోసారి ఐటీ శాఖ దాడులు చేయడం చర్ఛనీయాంశంగా మారింది. మరికాసేపట్లో హీరో యష్, కిచ్చా సుదీప్, సుష్మితా ఇంటిపై ఐటీ దాడులు జరగనున్నాయని సమాచారం. కొందరి ఇళ్లపై దాడిలో అక్రమ సంపాదన దొరికినట్లు సమాచారం.
- మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు: జగన్
- నిర్మాతగా మారిన యాంకర్ ఉదయభాను!
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
