- Advertisement -

టీవీ-సీఎ ఎన్ ఎక్స్ స‌ర్వే ఫ‌లితాలు… ఈ సారి జ‌గ‌న్ ప్ర‌భంజ‌న‌మే

- Advertisement -

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇక నాలుగు నెలల సమయం మాత్ర‌మే ఉంది. అన్ని పార్టీలు ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నాయి. అభ్య‌ర్తుల ఎంపిక‌లో త‌ల‌మున‌క‌లై ఉన్నాయి. జ‌న‌వ‌రిలో అభ్య‌ర్త‌లను ప్ర‌క‌టించేంద‌కు సిద్దంగా ఉన్నారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా వెలువ‌డ‌నుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌లు జాతీయ సంస్థ‌లు స‌ర్వేలు చేయ‌డం ..ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో త‌మ ఫలితాల‌ను వెల్ల‌డించ‌నున్నాయి. తాజాగా ఏపీలో టీవీ-సీఎ ఎన్ ఎక్స్ సంస్థ త‌న స‌ర్వేఫ‌లితాల‌ను విడుల చేసింది. ఈ ఫ‌లితాల్లో వైసీపీ స‌త్తా చ‌టుంద‌ని తెలిపింది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకీ 25 లోక్ స‌భ సీట్ల‌కు గానూ కేవ‌లం నాలుగంటే నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే దక్కుతాయట. గడచిన ఎన్నికల్లో ఒంట‌రిగా పోటీ చేసిన జ‌గ‌న్‌…అమ‌లు కాని హామీలు ఇవ్వ‌లేనంటూ కండ‌బ‌ద్ద‌లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. గడచిన ఎన్నికల్లో ఏపీలో 8 సీట్లు తెలంగాణలో ఓ సీటు సాధించిన వైసీపీకి ఈ దఫా ఒక్క ఏపీలోనే ఏకంగా 19 సీట్లు దక్కనున్నాయని సదరు సర్వే తేల్చేసింది.

ఇక కంగ్రెస్ పార్టీ మిగిలిన రెండు సీట్ల‌ను ద‌క్కించుకోనుంద‌ట‌. ఈ ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చాటుతామ‌ని గంభీరాలు ప‌లుకుతున్న జ‌న‌సేనకు మాత్రం క‌నీసం ఒక్క పార్ల‌మెంట్ సీటుకూడా ద‌క్కే ప‌రిస్థితులు శూన్యం. ఈ సర్వే చూస్తే… జగన్ వైరి వర్గాలన్నీ ఉడికిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ఈ సర్వేను చూసి టీడీపీ – జనసేనకు చమటలు పడుతున్నాయంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -