- Advertisement -

సాక్షి లోగోపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్‌

- Advertisement -

రెండు రోజులు క్రితం ప‌వ‌న్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో కరువు నేపధ్యంలో రైతుల కష్టాలపై, ఆత్మహత్యలకు దారితీస్తున్న ప‌రిస్థితుల కోసం ఆమె అధ్య‌య‌నం చేస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆమె సాక్షి టీవీని త‌న ప్ర‌తినిధిగా పెట్టుకుంది. సాక్షి లోగోతో రేణు దేశాయ్ క‌నిపించే స‌రికే అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. ప‌వ‌న్‌ను రాజ‌కీయంగా దెబ్బ‌కొట్ట‌డానికే జ‌గ‌న్ ఇలా రేణుదేశాయ్‌ను వాడుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

తాజాగా వీటిపై స్పందించింది రేణు దేశాయ్‌. త‌న ప‌ర్యాట‌న‌లో ఎటువంటి రాజ‌కీయాలు లేవ‌ని ఆమె స్ఫ‌ష్టం చేసింది.రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియబరచడానికే కర్నూలు వెళ్లినట్లు తెలిపింది. రైతుల‌కు మంచి జ‌ర‌గాల‌ని చేస్తోన్న అధ్య‌యానానికి రాజ‌కీయ రంగు పుల‌మ వ‌ద్ద‌ని ఆమె కోరింది. తన కారణంగా ఒక్క రైతు జీవితం మారిన ఎంతో సంతృప్తికరంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -