- Advertisement -

దసరాలోగా జిల్లాల ఏర్పాటు పూర్తి

- Advertisement -

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. మంగళ, బుధవారాల్లో వివిధ జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరో రెండు సార్టు కలెక్టర్ల సమావేశం నిర్ణయించాలని, అవి ఈ నెల 20న, జూలై 5 వ తేదిన జరపాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ నెల 30 వ తేది లోగా పార్టీ నాయకులు, ఇతరుల అభిప్రాయాలను సేకరిస్తారు. జూలై 10, 11 తేదీల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కొత్త జిల్లాల గురించి వారితో చర్చిస్తారు. కొత్త జిల్లాలు ప్రకటన తర్వాత వాటిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు నెల రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించారు.

అనంతరం అక్టోబర్ 11 అంటే దసరా రోజున కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారు. అలాగే కొత్త మండలాలను కూడా ప్రకటిస్తారు. ఒక్కో మండలంలో 40 నుంచి 50 వేల జనాభా ఉండేలా చూస్తున్నారు. ఇక 20 మండలాలు కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేయలని భావిస్తున్నారు. దాదాపు లక్షన్నర జనాభాతో అర్బన్ మండలం, ఒక రెవిన్యూ డివిజన్ పరిధిలో పది నుంచి ఇరవై మండలాలు ఉండేలా చూస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -