- Advertisement -
ఎన్నికల ప్రాచారంలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం జగన్ నిర్వహించిన ప్రచార సభలో అపశృతి చోటుచేసుకుంది. జనాలు భారీగా రావడంతో సంఘటన చోటు చేసుకుంది. బహిరంగ సభ ముగిసిన తరువాత జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించాడు. మృతి చెందిన వ్యక్తి పెద్దూరు మాజీ సర్పంచ్ బేట్రాయుడుగా గుర్తించారు. తొక్కిసలాట జరిగిన వెంటనే బేట్రాయుడు స్పృహ కోల్పోగా వెంటనే గుర్తించిన కార్యకర్తలు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
