- Advertisement -

టీడీపీ మాట: రేవంత్ ను ఇరికించడానికి వాళ్లంతా చేతులు కలిపారట!

- Advertisement -

ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కొన్న తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విషయంలో స్పందించడానికి నిన్నటి వరకూ తెలుగుదేశం నేతలు వెనుకాడారు. ఈ వ్యవహారం లో ఏం మాట్లాడితే ఏమవుతుందో.. అన్నట్టుగా తెలుగుదేశం నేతలు ఎక్కడిక్కడ గప్ చుప్ అయ్యారు. మామూలుగా అయితే ఏ మ్యాటర్ గురించి అయినా టీడీపీ స్పోక్ పర్సన్ లు ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందే.

అయితే ఈ విషయంలో వాళ్ల నోళ్లకు ప్లాస్టర్లు పడ్డాయి.

అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో కొంత వేడి తగ్గడంతో తెలుగుదేశం గొంతులు మళ్లీ  లేస్తున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కోరొక్కరుగా మీడియా ముందుకు వస్తున్నారు. తమ పార్టీ తరపున వకాల్తాపు చ్చుకొని మాట్లాడుతున్నారు. మరి ఇలా మాట్లాడటంలో.. ఓటుకు నోటు వ్యవహారం గురించి ఏమైనా గట్టిగా సమాధానం చెబుతారా? అంటే అలాంటిదేమీ కనిపించడం లేదు!

తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇదంతా కుట్ర అని అంటున్నారు. ఈ కుట్రలో తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు భాగస్వామ్యులు అని తెలుగుదేశం నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం ఉందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. అందరూ కలిసి తెలుగుదేశం పార్టీపై కుట్ర పన్ని రేవంత్ రెడ్డిని ఇరికించారని.. అన్ని కెమెరాలు పెట్టడమే దీనికి సాక్ష్యం అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చాడు. మరి ఇంకేం మాట్లాడాలో అర్థం కాని స్థితిలో తెలుగుదేశం నేతలు ఇలా ఎదురుదాడి చేస్తున్నట్టుగా ఉన్నారు! అయినా ఈ వాదనలో పస ఏముంది?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -