- Advertisement -
సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి కొంత ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ఏసిబి కోర్టు మంజూరు చేసింది. కేవలం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తన కూతురు నిశ్చితార్థానికి మాత్రమే హాజరు కావాలని షరతు పెట్టింది.
కేసు దర్యాప్తులో ఉన్నందున ఎవరితో రహస్యంగా మాట్లాడటం, సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతు విధించింది.
ఈ కేసులో సుప్రీం కోర్టు న్యాయవాది ఒకరు రేవంత్ రెడ్డి తరపున వాదనలు వినిపించించారని సమాచారం. కేవలం నిశ్చితార్థానికి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటం మాత్రమే చేయాలని, రహస్యంగా ఎవరితో మాట్లాడవద్దని, మీడియాతో కూడా మాట్లాడకూడదని షరతు పెట్టిందని సమాచారం.
