- Advertisement -

మరో కీలక నిర్ణయం తీసుకున్న జగన్..

- Advertisement -

ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పేరు ఖరారు చేసిన సీఎం జగన్ ..
ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హాహీలను దాదాపు నెరవేర్చారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అవినీతిని నిర్మూలించె విధంగా వెల్తున్న జగన్ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయవాది జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి పేరును ఖరారు చేశారు.ఏపీ ప్రభుత్వం ఇటీవల లోకాయుక్త చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నిర్మించాలని నిబంధనలను సవరించారు.లక్ష్మణ్ రెడ్డి పేరుకు ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ ఆమోదముద్ర వేశారు.

ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటరీ కార్య దర్శులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, విచారించే అధికారం లోకాయుక్తకు ఉంది.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్‌ విప్‌, ప్రజా వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం నియమించే ఏ అధికారిపై అయినా లోకాయుక్త విచారణ జరపవచ్చు.జడ్జీలు, జ్యుడీషియల్‌ సర్వీసు సభ్యులు మాత్రం దీని పరిధిలోకి రారు.

కోర్టు అధికారి, ఉద్యోగి కూడా లోకాయుక్త పరిధిలోకి రారు. వీరితో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఏపీఏటీ చైర్మన్, ఇతర సభ్యులు, ఏపీ అకౌంటెంట్ జనరల్, ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు, ఎన్నికల అధికారులను లోకాయుక్త విచారించలేదు. లోకాయుక్తగా లక్ష్మణ్ రెడ్డి నియామకాన్ని ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీచేయనుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -