- Advertisement -
జబర్దస్త్,ఢీ షోలతో ఎంతో పాపులరిటీ సంపాదించుకుంది యాంకర్ రష్మి .తరువాత కాలంలో నటిగా కూడా కొన్ని సినిమాలలో నటించింది.తాను పట్టి పెరిగింది అంతా విశాఖపట్టణంలో అని తెలిపింది.ఇక సుదీర్తో రష్మీ ప్రేమలో ఉందని వీళ్లద్దరు పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు అప్పట్లో చాలానే వచ్చాయి.అయితే పెళ్లి గురించి రష్మీని అడిగితే ప్రస్తుతానికి అటువంటి ఆలోచన లేదని అన్నారు. దేనికైనా టైమ్ రావాలని తన తాతయ్య చెప్పేవారని.. ఆ సమయం వచ్చినప్పుడు అదే అవుతుందని అన్నారు.
లవ్ ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా అనే ప్రశ్నకు సమాధానంగా.. అవన్నీ జీవితంలో ఒక భాగమని, చాలా మంది తనకు ప్రపోజ్ చేసినట్లు వెల్లడించింది. ఐదేళ్ల క్రితం వస్తూ తాను కూడా ప్రపోజ్ చేసినట్లు తెలిపింది.అయితే ఎవరికి ప్రపోజ్ చేసిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
