- Advertisement -

మ‌ళ్లీ రెచ్చిపోయిన బాల‌య్య …జర్నలిస్ట్ పై దాడి

- Advertisement -

హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాల‌య్య మ‌రోసారి రెచ్చిపోయారు. కోపంలో అభిమానుల‌పైనే దాడి చేసే బాల‌య్య ఈ సారి ఏకంగా జ‌ర్న‌లిస్ట్‌పైనే చేయి చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే 2019 జ‌రిగే ఎన్నిక‌ల్లో కూడా హిందూపురం నియోజకవర్గం నుంచే ఆయ‌న పోటీ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయ‌న హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే బాల‌య్య‌ను చూసేందుకు చిన్నపిల్లలు వస్తుండటంతో ఆయన వ్యక్తిగత సిబ్బందిని వారిని పక్కకు లాగేయండ‌ని బాలకృష్ణ ఆదేశించారు. ఇదంతా అక్క‌డే ఉన్న ఓ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ వీడియోగ్రాఫ‌ర్ చిత్రీక‌రించారు. ఇది గ‌మ‌నించిన బాలయ్య ఆ కెమెరామెన్‌పై ద‌రుసుగా ప్ర‌వ‌ర్తించారు. కెమెరాలో చిత్రీకరించిన దృశ్యాలను డిలీట్ చెయ్యాలని తిట్టిపోశారు. కోపంతో చెయ్యి కూడా చేసుకున్నారు. రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగులుపెడతాను, ప్రాణాలు తీస్తాను,బాంబులు వేయడం​ కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు అంటూ బాలయ్య బెదిరింపులకు పాల్పడ్డారు.

ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారడంతో బాల‌య్య‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో బాల‌య్య న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేట్టారు. జర్నలిస్ట్‌పై చెయ్యి చేసుకున్న ఘటనపై బాల‌య్య స్పందించారు. అక్కడ ఉన్న చిన్నపిల్ల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరి మూకల పని అని భావించి వారిని వారించడం జరిగిందని స్పష్టం చేశారు. అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసిందన్నారు. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధకలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. కాని అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -