బిగ్‌బాస్ రెండో సీజన్‌లో హోస్‌మెట్స్ మధ్య అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.నిన్న(మంగళవారం)జరిగిన ఎపిసోడ్‌లో పలు ఆసక్తి కరమైన సంఘటనలు జరిగాయి.షో మొదటి నుండి కౌశల్‌ను ఒంటరి చేసి మిగతా హోస్‌మెట్స్ అందరు ఓ టీమ్‌లా ఏర్పడిన సంగతి అందరికి తెలిసిందే.నిన్నటి ఎపిసోడ్ లో మహిళలు, పురుషులు రెండు టీమ్ లుగా విడిపోయి ‘అంతిమ యుద్ధం’ అనే టాస్క్ ను పూర్తి చేయాలి. ఇది ఫిజికల్ టాస్క్ కావడంతో మొదటినుండి పురుషులు ఆధిక్యత కనబరిచారు. టాస్క్ లో భాగంగా రెండు టీమ్ లకు బిగ్ బాస్ 50 గోల్డ్ కాయిన్ చొప్పున ఇచ్చారు. ఈ రెండు టీమ్‌లకు హౌస్ పై నియంత్రణ ఉంటుంది. మహిళల టీమ్ నియంత్రణలో ఉండే స్థలాలు బెడ్ రూమ్, కిచెన్ రూమ్. పురుషులు టీమ్ నియంత్రణలో ఉండే స్థలాలు లివింగ్ ఏరియా, బాత్ రూమ్‌లు.ఈ టాస్క్ లో చూపిన ప్రతిభ ఆధారంగా కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే ఛాన్స్ ఉంటుందని అనౌన్స్ చేశారు.
అయితే గేమ్ ఆడే క్రమంలో కౌశల్ మహిళలు దాచుకున్న కాయిన్స్ బ్యాగ్ ను దొంగిలించారు. దీంతో కెప్టెన్ పూజా, కౌశల్ ల మధ్య వివాదం చెలరేగింది. కౌశల్ కాయిన్స్ దొంగిలించడంపై పూజ ఫైర్ అయింది.రా అంటూ కౌశల్ పైకి దూసుకెళ్లింది. దమ్ముంటే గేమ్ కరెక్ట్ గా ఆడాలని సవాల్ విసిరింది. బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ పెద్ద దొంగ అంటూ ఆరోపణలు చేసింది. దీనికి కౌశల్ కూడా రియాక్ట్ అయ్యాడు. తనను తాను సమర్ధించుకుంటూ మాట్లాడాడు. తన దగ్గరున్న మిగిలిన కాయిన్స్ ని కూడా కౌశల్ పై విసిరికొట్టింది. కిచెన్ నుండి పురుషులకు వాటర్ కూడా ఇవ్వకూడదని హుకుం జారీ చేసింది.ఇంత జరుగుతున్న హోస్‌మెట్స్ ఎవరు కౌశల్ దగ్గరికి వచ్చి మాట్లాడలేదు.పైగా అతని వెనక ఉండి కౌశల్‌ను విమర్శించారు.ఈరోజు కూడా గేమ్ కంటిన్యూ అవ్వడంతో ఏం జరుగుతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
