సూర్య “ఆకాశం నీ హద్దురా ” ఎటువైపు..!!

- Advertisement -

సూర్య నటించిన ప్రతి సినిమా కి ఎదో ఒక వివాదం అవుతూనే ఉంటుంది.. అయన తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా తొందరలో రిలీజ్ కానుంది.. అయితే ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్స్.. దీనికి కారణం సూర్య సతీమణి నటించిన పొన్‌మ‌గ‌ల్ వందాల్‌` ని ఓటీటీకి ఇవ్వడమే..

డిస్టిబ్యూట‌ర్లూ, ఎగ్జిబ్యూట‌ర్లూ ఆ సినిమాని థియేటర్లోనే రిలీజ్ చేయాలనీ ఎంత మొత్తుకున్నా వినకుండా OTT కి అమ్మేశాడు. దాంతో ఆగ్రహించిన వారు సూర్య సినిమా లను థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకుంటాం అని శపథం చేశారు.. అనుకున్నట్లుగానే ఇప్పుడు సూర్య నటించిన ఆకాశం నీహద్దురా సినిమా ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

ఇక దానికి తోడు త‌మిళ‌నాడు మంత్రి క‌డంబూర్ రాజు కూడా సూర్య నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఓటీటీలో సినిమాని విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని, అలా చేస్తే.. థియేట‌ర్ వ్య‌వ‌స్థ పూర్తిగా దెబ్బ‌తింటుంద‌ని, సూర్య లాంటి పెద్ద హీరోలు ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల చిత్ర‌సీమ దారుణంగా న‌ష్ట‌పోతుంద‌ని, ఈ విష‌యంలో సూర్య ఆలోచించుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చారు. సాక్షాత్తూ మంత్రి గారే… సూర్య నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్ట‌డంతో అక్క‌డి సూర్య వ్య‌తిరేక వ‌ర్గం రెచ్చిపోతోంది. చిత్ర‌సీమ‌ను కాపాడుకోవాల‌న్న ఉద్దేశం సూర్య‌కు లేద‌ని, త‌న లాభ‌మే చూసుకుంటున్నాడ‌ని వాడీ వేడీ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీట‌న్నింటినీ సూర్య లైట్ తీసుకుంటున్నాడు. కాక‌పోతే.. అంద‌రికీ త్వర‌లోనే గ‌ట్టిగా స‌మాధానం ఇవ్వాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఈసారి సూర్య ఎలాంటి ఎదురు దాడి చేస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -