Wednesday, May 8, 2024
- Advertisement -

భార‌త్‌పై పొలాండ్ బుడ్డోడి దేశ‌భ‌క్తి చూడండి

- Advertisement -

గ‌ణ‌తంత్ర దినోత్స‌వ కార్య‌క్ర‌మాలు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రిగాయి. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మ‌న‌దే. ఈ రాజ్యాంగం అమ‌లు చేసిన జ‌న‌వ‌రి 26వ తేదీన మ‌నం గ‌ణ‌తంత్ర వేడుక‌లు అత్యంత వైభ‌వంగా జ‌రుపుకుంటాం. ఈ వేడుక‌లు ప్ర‌పంచ దృష్టిని విశేషంగా ఆక‌ర్షిస్తుంటాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త్ పేరు మార్మోగుతోంది.

పొలాండ్‌కు చెందిన బాలుడు బిగ్నీవ్ చెర్టలూర్ (Zbigniew A. Chertlur) భార‌త‌దేశం అంటే వీరాభిమానం. అత‌డి తండ్రి ప్ర‌వాస భార‌తీయుడు కావ‌డంతో మ‌న‌దేశంపై అభిమానం పెంచుకున్నాడు. త‌ర‌చూ ఇక్క‌డి విశేషాలు తెలుసుకుంటూ ట్విట్ట‌ర్ బాయ్‌గా పేరు పొందాడు. ఇప్పుడు గ‌ణ‌తంత్ర వేడుక‌ల సంద‌ర్భంగా వందేమాత‌రం గేయాన్ని పాడాడు.

న‌మ‌స్తే అని స్వాగ‌తం ప‌లుకుతూ భార‌త‌దేశ కీర్తిని పొగిడిన అనంత‌రం వందేమాత‌రం గేయాన్ని పాడాడు. బుడ్డోడి వెన‌క దేశ మువ్వ‌న్నెల జెండా, భార‌త‌దేశ ప‌టం రెప‌రెప‌లాడుతూ ఉండ‌గా బిగ్నివ్ గేయం పాడాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -