Tuesday, May 14, 2024
- Advertisement -

కథలో రాజకుమారి మూవీ రివ్యూ

- Advertisement -

కొత్త తరహా సినిమాలు చేయడానికి నారా రోహిత్ ఎప్పుడు ముందు ఉంటాడు. ఇప్పుడు ఇదే కోవలో నారా రోహిత్ మరో కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని కి ఛాన్స్ ఇస్తూ తీసిన సినిమా కథలో రాజకుమారి. ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

అర్జున్ చక్రవర్తి ( నారా రోహిత్ ) సినీ పరిశ్రమలో తిరుగు లేని విలన్. ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా.. అంతకు మించి ఇమేజ్ ఉంటుంది. అదే ఇండస్ట్రీలో హీరోగా నాగశౌర్య ఉంటాడు. అర్జున్ ప్రవర్తన నాగశౌర్యకు నచ్చదు. అయితే ఓ ఆక్సిడెంట్ వల్ల అర్జున్ పవర్తన ఆలోచనా విధనాం మారుతాయి. మంచి మనిషిగా మారుతుంటాడు. దాని ఎఫెక్ట్ అతని పాత్రల మీద పడుతుంది. దీంతో అర్జున్ కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది. దాన్ని కాపాడుకోడానికి ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడిని ఆశ్రయిస్తాడు అర్జున్. ఆ నిపుణుడు అర్జున్ లోని పాత దూకుడు , విలనీ బయటకు రావాలంటే ఓ శత్రువు మీద పగ తీర్చుకోమని సలహా ఇస్తాడు. దీంతో అతను ఎక్కడో ఓ పల్లెటూళ్ళో ఉంటున్న తన చిన్ననాటి స్నేహితురాలు కమ్ శత్రువు సీత దగ్గరికి వెళతాడు. పైకి ఆమెతో మంచిగా ఉంటూనే ఆమెకి చెడు చేస్తుంటాడు. ఈ అర్జున్ పన్నాగం నుంచి సీత ఎలా బయటపడింది? అసలు బాల్యంలో వారి మధ్య ఏమి జరిగింది ? అర్జున్ మారాడా? వంటి ప్రశ్నలకు జవాబు ఈ సినిమా స్టోరీ.

ఎలా ఉందంటే :

ఈ సినిమా స్టోరీ చూస్తే.. చాలా కొత్త ఉంది. సినీ నెపథ్యంలో సాగే సినిమా కాబట్టి కొత్తగా అనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నారా రోహిత్ గురించి. ఆయన ఈ పాత్ర కోసం స్పెషల్ ఎఫర్ట్ పెట్టాడు. నటన పరంగా.. ఫిజిక్ పరంగా కొత్తగా కనిపించాడు. ఇక ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్. నాగ శౌర్య కూడా బాగా చేశాడు. హీరోయిన్ నమిత ప్రమోద్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అయితే ఈ సినిమా కథ కొత్తగా ఉన్న… కథనంలో దమ్ము లేదు. డైలాగ్స్ బాగాలేవు. అక్కడ అక్కడ సీన్స్ తప్పిస్తే.. మొత్తంగా చూస్తే కధలో రాజకుమారి ఓ మంచి ప్రయత్నమే కానీ సక్సెస్ అవుతుందని చెప్పలేం. కథనం విషయంలో దర్శకుడు ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.

ప్లస్ పాయింట్స్ :

* సినిమా స్టోరీ
* నారా రోహిత్ నటన
* ఇళయరాజా సంగీతం

మైనస్ పాయింట్స్ :

* కథనం, డైలాగ్స్
* డైరెక్షన్
* ఫ్లాట్ న్యారేషన్

మొత్తంగా : కథలో రాజకుమారి.. కథ బాగున్నప్పటికి కథనం దెబ్బకొట్టింది. ఆ విషయంలో డైరెక్టర్ జగ్రత్తలు తీసుకుని ఉంటే మంచి సినిమా అయ్యేది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -