త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రిన్స్ మహేష్ బాబు ప్రచారం చేస్తారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ మాత్రం తనకు రాజకీయాలపై ఆసక్తిలేదని అలాంటి ప్రశ్నలు అడగవద్దని మీడియాకు చెబుతూనే ఉన్నా ఆ వార్తలు మాత్రం ఆగడంలేదు. మహేష్ బంధువులు టీడీపీలో కొనసాగుతున్నారు. బావ గల్లా జయదేవ్, బాబాయ్ ఘట్టమనేని ఆది శేషగిరిరావు లాంటి ప్రముఖలు టీడీపీలో ఉన్నారు.గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉండా ఈ మధ్యనే ఘట్టమనేని ఆది శేషగిరిరావు వైసీపీనుంచి టీడీపీలో చేరారు.
మహేష్ బంధువులందరూ టీడీపీలో ఉండటంతో త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రచారం చేస్తారనే వార్తలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఊహాగానాలపై మహేష్ సతీమణి నమ్రతా స్పందించారు. తన భర్త ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే వార్తలను ఖండించారు.
రాష్ట్రానికి ఎంతో చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే నా భర్తకు చాలా గౌరవం ఉంది. మరోవైపు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధిపథంలో ఉండటాన్ని చూసి ఆయన చాలా గర్విస్తుంటారు. చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఉన్నంత మాత్రాన తన భర్తని పొలిటికల్ ఫిగర్ చేయొద్దని నమ్రత కోరింది. మహేష్ బాబు ఏ రాజకీయ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని నమ్రత తేల్చి చెప్పింది.
