- Advertisement -

డాక్ట‌ర్లు న‌యం చేయ‌లేని వ్యాధితో బాధ‌ప‌డుతున్న ర‌వితేజ‌?

- Advertisement -

మాస్ రాజా ర‌వితేజ అంటే వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది ఎన‌ర్జీ. ఎప్పుడు ఎన‌ర్జీగా ఉంటే ర‌వితేజ డాక్ట‌ర్లు న‌యం చేయ‌లేని వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడట‌. కంగారు ప‌డ‌కండి అయితే ఇది నిజ జీవితంలో కాదులేండి. అయితే ఇదంతా సినిమాలో రవితేజ పోషించే క్యారెక్టర్ కి సంబంధించినదని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ దర్శకుడు శ్రీనువైట్ల రూపొందిస్తోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని వార్తలు వినిపించాయి.ఫస్ట్ లుక్‌లో కూడా రవితేజకి చెందిన మూడు గెటప్పులు విడుదల చేయడంతో నిజమనే అనుకున్నారు. కానీ సినిమాలో కనిపించేది మాత్రం ఒక్క రవితేజనే.

కథ ప్రకారం సినిమాలో హీరోకి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్. దీంతో హీరో అమర్, అక్బర్, ఆంటోనీ అనే ముగ్గురు వ్యక్తుల్లా గెటప్స్ వేసుకొని ప్రవర్తిస్తుంటాడని స‌మ‌చారం. శ్రీనువైట్ల మాత్రం ఆ పాత్రల ద్వారా కామెడీ జెనరేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మూడు విభిన్నమైన పాత్రల్లో రవితేజ చేసే అల్లరి ఆడియన్స్ ని నవ్విస్తుందని మేకర్స్ చెబుతున్నారు. సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న హీరోయిన్‌గా గోవా బ్యూటీ ఇలియానా న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -