Wednesday, May 15, 2024
- Advertisement -

స్పైడర్ లో డైరెక్టర్ చెప్పిన అసలు పాయింట్ ఇదే

- Advertisement -

మురగదాస్ చిత్రాల విషయంకు వస్తే.. ఆయన వినోదంతో పాటు.. అంతర్లీనంగా ఒక సందేశం ఉండేట్లు చూసుకుంటారు. సందేశాన్ని డైరెక్ట్ గా కాకుండా కమర్షియల్ ప్యాకేజీ రూపంలో ప్రేక్షకులకు అందిస్తాడు. రమణ (ఠాగూర్), గజిని, స్టాలిన్, తుపాకి, కత్తి (ఖైదీ నెంబర్ 150).. ఇలా ఆయన తీసిన ప్రతి సినిమాలో ఒక మంచి విషయం గురించి చెప్పారు. ఇప్పుడు మహేష్ బాబుతో తీయబోయే సినిమాలో కూడా అదే జరగనుందట.

ఈ మూవీ కోర్ కాన్సెప్ట్ కూడా ఓ మంచి విషయంతో ముడిపడి ఉంటుందని దర్శకుడు మురుగదాస్ వెల్లడించాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం వేగంగా మారింది. వెంటనే తయారు అయ్యే.. కాపీ, రెండు నిమిషాల్లో వండే నూడుల్స్‌, రెడీమేడ్‌ మసాలాలు.. చివరికి దేవుణ్ణి కూడా వేగంగానే ప్రార్ధిస్తున్నారు. రోడు మీద నుంచి వెళ్తూ.. బయట నుంచే దండం పెట్టుకుంటున్నారు. పక్క వాళ్ల గురించి ఆలోచించే.. పట్టించుకునే.. సమయం ఎవరికి లేదు. అయితే ఏ విషయంలో అయిన వెంగంగా ఉండొచ్చు కానీ.. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులను ప్రేమించలేనంత తీరిక ఉండకూడదు. రాను రానూ మనుషుల్లో మనవత్వం అనేది తగ్గిపోతుంది. అసహ్యం పెరిగిపోతోంది.

ఐతే ఈ వేగవంతమైన యుగంలో వేగంగా దూసుకెళ్లాలి కానీ మానవత్వాన్ని మరచిపోకూడదు. ఈ విషయాన్నే ‘స్పైడర్’లో చెబుతున్నాం. అది ఎలా చెప్పామన్నది తెరమీదే చూడాలి’’ అని మురుగదాస్ చెప్పారు. అయితే ఒక సినిమా తీస్తున్నప్పుడు మొత్తంగా దీన్ని ప్రేక్షకులు ఎలా రీసివ్ చేసుకుంటారు అని ఆలోచిస్తాం.. కానీ స్పైడర్ విషయంలో.. మాత్రం రీలు రీలుకు మనం ఏం చెబుతున్నాం అని.. ప్రేక్షకులు ఎలా రీసివ్ చేసుకుంటారు ఆలోచిస్తూ స్క్రిప్టు రాసుకుని, సినిమా తీసినట్లు దర్శకుడు చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -