కొద్ది రోజులు క్రితం నుంచి మెగా, నందమూరి ఫ్యామిలీల మధ్య తీవ్ర వివాదం జరగుతోంది. మెగా బ్రదర్ నాగబాబు కొన్ని రోజులు నుంచి నందమూరి హీరో బాలకృష్ణపై సెటైర్స్ వేస్తున్న సంగతి తెలిసింది. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో నాగబాబు తన విమర్శల దాడిని మరింత పెంచాడు. ఇప్పటి వరకు ఇన్‌డైరెక్ట్‌గా బాలయ్యపై కామెంట్స్ చేసిన నాగబాబు ఇప్పుడు డైరెక్ట్‌గానే కామెంట్ చేయడం విశేషం. గతంలో బాలకృష్ణ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు ..అమితాబ్ బచ్చన్ ఏం పీకాడని మీరు కామెంట్ చేశారు. బాలయ్య తండ్రి ఎన్టీఆర్ గొప్పే,కాని మిగత వారిని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికాడు నాగబాబు.
ఎన్టీఆర్‌తో పాటు అమితాబ్ బచ్చన్ ,కన్నడ రాజ్ కుమార్, ఎంజీఆర్ కూడా అంతే గొప్ప నటులని తెలిపారు నాగబాబు. బాలయ్య చిరంజీవిని కూడా చాలా సందర్భాలలో చులకన చేసి మాట్లాడారని, అంత ఏం ఉందని ప్రశ్నించారు నాగబాబు. ఏమైన అంటే మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరని చెప్పుకొస్తారు.మీరేమైనా రాజా సూర్యవంశీకులా..? మమ్మల్ని అవమానించి మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అంటే మాకు కోపం రాదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాగబాబు. ఇక్కడ అందరు సమానమే అని , అందరు హీరోలే అని బాలయ్యకు చురుకలు అంటించాడు నాగబాబు. ఎన్టీఆర్‌ను తన బావ చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు మీరు ఏం చేశారు, అప్పుడు ఏమైంది మీ బ్రీడ్, మీ బ్లడ్ అంటూ బాలయ్యకు కౌంటర్ ఇచ్చాడు నాగబాబు. మరి దీనిపై బాలయ్య కాని , ఆయన అభిమానులు కాని ఎలా స్పందిస్తారో చూడాలి.
- పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ టీజర్ అవుట్
- ‘టాక్సిక్’ క్రేజీ స్పెషల్ వీడియో రిలీజ్..
- వివాహేతర సంబంధం.. ఆర్మీ జవాన్‌ను కొట్టి చంపిన భార్య!
- బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి జగన్ అండ
- జాన్వీ కపూర్ పై ట్రోలింగ్.. జగపతి బాబు కీలక వ్యాఖ్యలు !
