Friday, March 29, 2024
- Advertisement -

జై సింహ టీజర్……. బాలయ్యను విమర్శించాలంటే మీడియాకు ఎందుకుంత భయం?

- Advertisement -

అధికారంలో ఉన్నవాళ్ళను విమర్శించాలంటే మీడియాకు దడ పుట్టడం ఎప్పుడో స్టార్ట్ అయింది. అలాగే మీడియా సంస్థలు జనాల కోసం పనిచెయ్యడం మానేసి పార్టీల కోసం, నాయకుల భజన కోసం, ఆమ్యామ్యాల కోసం పనిచెయ్యడం ఎప్పుడో మొదలయ్యింది. అయితే ఆ పార్టీ అధినాయకుడి నుంచి…ఆయన వేలు విడిచిన బంధువులు, ఆయన వర్గం వారినందరినీ పొగడాల్సిన దుస్థితిలో మీడియా ఉండడమే మరీ బాధనిపిస్తోంది.

నానీ రొటీన్ సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య రామ్ చరణ్ కూడా రొటీన్ సినిమాలు చేశాడు. దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు నానీ కూడా ఎంసిఎతో దెబ్బతిన్నాడు. వీళ్ళిద్దరితో పాటు ఇతర హీరోలను కూడా మన మీడియా ఘాటుగానే విమర్శించింది. మరి బాలయ్యకు ఆ సూత్రం వర్తించదా. జైసింహా టీజర్ రిలీజ్ అయిన వెంటనే మన భజన మీడియా జనాలందరూ టీజర్ బాలయ్య స్టైల్లో ఉంది……..అదిరిపోయింది…….అభిమానులకు ఇక పండగే అంటూ ఏదేదో రాశారు. అసలు ఆ టీజర్‌లో ఏం ఉంది? నేను మనిషిని కాదు……సింహం లాంటోడ్ని అని ఇంతకుముందు చాలా సినిమాల్లో బాలయ్య చెప్పిన డైలాగ్‌నే మరోసారి వినిపించారు. ఇక బాలయ్య కాస్ట్యూమ్స్ విషయం పక్కన పెడితే కనీసం సూట్ అయ్యే విగ్గు కూడా సెట్ చేయలేకపోయారు. ఆ విగ్గు మరీ కామెడీగా, కొంచెం చిరాకు వేసేలా కూడా ఉంది. ఇక విజువల్స్‌లో ఒక్కటి కూడా కొత్తది లేదు. కెమేరా వర్క్, మ్యూజిక్ అన్నీ కూడా పూర్తి టేస్ట్‌లెస్‌గా ఉన్నాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే పూర్తిగా విషయం లేని ఒక బ్యాడ్ టీజర్. కనీసం బాలకృష్ణను కూడా అబిమానులకు నచ్చేలా చూపించలేకపోయారు. కానీ మీడియా మాత్రం పవర్ చేతిలో ఉన్న చంద్రబాబుకు బంధువు అనో, లేకే ఇతర కారణం ఏమైనా ఉందో తెలియదు కానీ ఆహా…….ఓహో……అనడం మొదలెట్టింది.

ఆ మధ్య రిలీజ్ అయిన ఒక కోటి రూపాయల బడ్జెట్‌లో వచ్చిన చిన్న సినిమాను ఒక భజన మీడియా సంస్థ ఉతికారేసింది. రొటీన్ కథతోవిసిగించారని, ఇండస్ట్రీ పాడైపోవడానికి ఇలాంటి సినిమాలే కారణమని ఆ భజన మీడియా సంస్థ రాసింది. ఆ దెబ్బతో ఆ సినిమా డైరెక్టర్ వేరే టివి స్టూడియోకు వెళ్ళి లబోదిబోమన్నాడు. డబ్బులు అడిగారని…….కానీ అప్పటికీ సినిమా రిలీజ్ కోసం పెట్టిన డబ్బులతో మా దగ్గర అయిపోయాయని…….అటూ ఇటూగా ఎంతో కొంత ఇస్తామని చెప్పామని…….దాంతో మమ్మల్ని అవమానిస్తారా……..మీ సినిమా పని చూస్తాం అని చెప్పి మా సినిమాను ఉతికి ఆరేశారని…..సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని చెడగొట్టడానికే మేం సినిమా తీశాం అన్నట్టుగా రాశామని లబోదిబోమన్నాడు ఆ డైెరెక్టర్. మరి ఇప్పుడు అదే భజన మీడియా సంస్థ బాలకృష్ణ జై సింహా సినిమాను ఓ స్థాయిలో పొగిడేస్తోంది. ఈ జైసింహ రొటీన్ సినిమా కాదా? ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకీ మేలు చేస్తాయా? ఈ రకం సినిమాలు చూసే పక్క సినిమా ఇండస్ట్రీ జనాలు తెలుగులో అన్నీ రొడ్డకొట్టుడు సినిమాలే వస్తూ ఉంటాయి అని ఎటకారం చేస్తూ ఉండడం నిజం కాదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -