Wednesday, May 15, 2024
- Advertisement -

జాతీయ ఉత్త‌మ చిత్రాలుగా ‘ఘాజీ’,’బాహుబ‌లి’

- Advertisement -

కేంద్ర‌ప్ర‌భుత్వం 65వ జాతీయ సినిమా అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. జాతీయ సినిమా అవార్డుల తెలుగు సినిమాలు త‌మ హవాను చూపించాయి.అటు ‘బాహుబలి 2’, ఇటు ‘ఘాజీ’ అవార్డులను పొందాయి. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఘాజీ’ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఇందులో హీరో రానా ముఖ్య పాత్ర పోషించాడు. సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ కాకపొయిన విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి ఈ సినిమాకు.

ఇక బాహుబలి-2 సినిమా ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ విభాగాల్లో బాహుబలి 2 అవార్డులను గెలుచుకుంది. అలాగే ఉత్తమ వినోదాత్మక సినిమాగా కూడా అవార్డును పొందింది. ఉత్తమ హిందీ చిత్రంగా ‘న్యూటన్’ నిలిచింది.జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు నాగరాజ్ మంజులేకు దక్కింది. జాతీయ ఉత్తమనటిగా నిలిచింది దివంగత నటి శ్రీదేవి.ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచాడు ఏఆర్ రెహమాన్.

అవార్డుల జాబితా ఇలా ఉంది..
బెస్ట్ యాక్టర్(మేల్) -రిద్దీ సేన్(బెంగాలీ సినిమా నాగర్ కీర్తన్)
బెస్ట్ సింగర్ (మేల్)- కేజే యేసుదాస్
ఉత్తమ బాలల చిత్రం- మోర్క్య(మరాఠీ)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్-ఫవాద్ ఫాజిల్
బెస్ట్ ఫిమేల్ సింగర్- షాషా తిరుపతి(కాట్రు వెలియిడై)
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్- వాటర్ బేబీ
బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇస్యూస్ – అయామ్ బొనే, వెల్ డన్ (రెండు సినిమాలు)
బెస్ట్ షార్ట్ ఫిల్మ్(ఫిక్షన్)- మయ్యత్ (మరాఠీ)
బెస్ట్ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య(టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ -టేకాఫ్ (మలయాళం)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్- బనితా దాస్(విలేజ్ రాక్ స్టార్స్)
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు- దివంగత నటుడు వినోద్ ఖన్నా
నర్గీస్ దత్ అవార్డు (జాతీయ సమైక్యతా చిత్రం)- దప్పా(మరాఠీ)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -