Sunday, May 5, 2024
- Advertisement -

మా అసోసియేషన్‌కు ఒక్క‌రోజు టైం ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

- Advertisement -

సినీ న‌టుడు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ సినీ ఇండ‌స్ట్రీలో కాని పొలిటికల్‌గా కాని త‌న‌కు జ‌రుగుతున్న అన్యాయంపై ఈ రోజు ఉద‌యం ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎదుట త‌న నిరస‌న తెలిపారు.తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీ పెద్ద‌లు మా అసోసియేష‌న్ స్పందించాల‌ని లేక‌పోతే త‌ను ధ‌ర్నాకు దిగుతాన‌ని హెచ్చ‌రించాడు.సినీ పెద్దలు, కుటుంబ సభ్యులతో ఫిల్మ్‌ ఛాంబర్‌లో సమావేశమైన పవన్‌ కల్యాణ్‌ ‘మా’ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న కుట్రపై స్పందించాలని లేకపోతే దీక్షకు దిగుతానని పవన్‌ వారితో హెచ్చరించినట్లు సమాచారం. ‘కుట్ర వెనకాల ఉంది ఎవరో చెప్పాను. వారిపై చర్యలు తీసుకోవాలి. ‘మా’ చర్యలు చేపడతుందా? లేదా నేనే కార్యాచరణకు దిగలా? నా తల్లికి న్యాయం జరిగే వరకు ఛాంబర్‌ విడిచిపోను’ అని పవన్‌ వారితో ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది.

న‌టి శ్రీరెడ్డిని అడ్డుపెట్టుకుని వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని తీవ్ర ప‌దజాలంతో తిట్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలోకి ప‌వ‌న్ క‌ల్యాణ్ వాళ్ల అమ్మ‌గారిని కూడా లాగ‌డంతో ఈ విష‌యం చాలా పెద్ద‌దిగా మారింది.శ్రీరెడ్డి అసభ్య ప‌ద‌జాలంతో ప‌వ‌న్ వాళ్ల అమ్మ‌ని తిట్ట‌డం….దీని వెన‌కాల రాంగోపాల్ వ‌ర్మ ఉన్న‌డ‌ని తెలియ‌డంతో స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలంగా మారింది.ఈ గొడ‌వ‌పై నిన్న ప్రెస్ మీట్ పెట్టి మ‌రి రాంగోపాల్ వ‌ర్మ‌పై అల్లు అరవింద్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ రోజు ఉద‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్ వాళ్ల అమ్మ ఇందిరా దేవిని తీసుకుని ఫిల్మ్‌ ఛాంబర్ వ‌ద్ద కొంచెం సేపు హ‌ల్ చ‌ల్ చేశారు.ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా మెగా ఫ్యామీలి హీరోలు మొత్తం ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్దకు వ‌చ్చి ప‌వ‌న్‌కు సంఘీభావం తెలిపారు.రాంచ‌ర‌ణ్‌,అల్లు అర్జున్,వ‌రుణ్ తేజ్‌,సాయి ధ‌రమ్ తేజ్‌,నాగ‌బాబు అంద‌రు హ‌జ‌రై ప‌వ‌న్‌కు త‌మ స‌పోర్టు తెలిపారు.ఈ అందోళ‌న‌కి మెగాస్టార్ చిరంజీవి రాక‌పోవ‌డంపై చ‌ర్చ‌నీయంశంగా మారింది.ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అభిమానులు భారీగా హ‌జ‌రైయ్యారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఒక‌రోజు టైం ఇచ్చి పవ‌న్ ఫిల్మ్‌ ఛాంబర్‌ నుండి వెళ్లిపోయారు.24గంట‌ల త‌రువాత త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోతే దీక్షకు దిగుతానని పవన్‌ వారితో హెచ్చరించినట్లు సమాచారం.మ‌రి దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.మ‌రి శ్రీరెడ్డికి అన్యాయం జ‌రిగితే ఫిలిం చాంబ‌ర్ ద‌గ్గ‌ర ధ‌ర్నాకు దిగితే ….మీకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వెళ్లాల‌ని సూచించిన ప‌వ‌న్, ఇప్పుడు మాత్రం త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద ధ‌ర్నాకు దిగ‌డం ఎంత‌వ‌రకు న్యాయం అని సినీ ఇండస్ట్రీలో చాలామంది చ‌ర్చ‌రించుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -