Sunday, May 19, 2024
- Advertisement -

‘స‌ర్కార్’ వివాదంపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ర‌జినీకాంత్‌

- Advertisement -

స్టార్ హీరో విజ‌య్‌,మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చింది స‌ర్కార్‌.దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల అయిన ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికి కలెక్ష‌న్లు బాగానే ఉన్నాయి. చిత్రం విడుద‌ల రోజు నుంచి వివాదాల‌తోనే న‌డుస్తుంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు అన్నాడీఎంకె పార్టీని కించపరిచే విధంగా ఉన్నాయని, దివగంత జయలలితని తప్పుగా చూపించారంటూ ఆ పార్టీ కార్యకర్తలు గొడవ చేస్తున్నారు. సినిమా ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ఆడుతున్న థియేటర్ల వద్దకు చేరుకున్న కొందరు పార్టీ కార్యకర్తలు సినిమా బ్యానర్లు, విజయ్ కటౌట్లను ధ్వంసం చేశారు.

తాజాగా ఈ వివాదంపై త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌ స్పందించారు.సెన్సార్ బోర్డ్ క్లియరన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన తరువాత సినిమాలో సన్నివేశాలను తొలగించాలని, థియేటర్లలో ప్రదర్శించకూడదని డిమాండ్ చేయడం చట్టరీత్యా నేరం. నేను దీన్ని ఖండిస్తున్నాను” అంటూ వెల్లడించారు. నటుడు-రాజకీయనాయకుడు కమల్ హాసన్ కూడా అన్నాడీఎంకె పార్టీ చేస్తోంది తప్పని అన్నారు.ఇది ఇలా ఉంటే సినిమాలోని అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని చిత్ర నిర్మాత‌లు భావిస్తున్న‌ట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -