మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ఈ సంక్రాంతికి విడుదలైంది. రంగస్థలం సినిమా తరువాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాని ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తు ఘోరంగా ప్లాప్ అయింది. సినిమాను చూసిన సామాన్య ప్రేక్షకుడితో పాటు రామ్ చరణ్ అభిమానులు సైతం సినిమా బాలేదని తేల్చేశారు. తాజగా ఈ సినిమా కలెక్షన్లపై యాంటి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్లాప్ అయిన సినిమాకు 60 కోట్లు ఎలా వచ్చాయాని వారు ప్రశ్నిస్తున్నారు.
పవన్, మహేశ్ సినిమాలే ప్లాప్‌లు అయితే 30 కోట్లు కూడా రావడం లేదు. మరి అలాంటి రామ్ చరణ్ సినిమా ప్లాప్ అయిన తరువాత కూడా 60 కోట్లు ఎలా వచ్చాయాని రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్ అడుతున్నారు. సినిమాకు మొదటి రోజు 27 కోట్లు రాగ, రెండో రోజు కేవలం నాలుగు కోట్లు మాత్రమే వచ్చాయని వారు అంటున్నారు. ఈ సినిమా ఓవరాల్‌గా 38 కోట్లు సాధించిందని, కాని చిత్ర యూనిట్ మాత్రం 60 కోట్లు వచ్చాయని ప్రకటించడం దారుణం అని అంటున్నారు. మరి దీనిపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
