Saturday, May 4, 2024
- Advertisement -

నారా హీరో కి ఆరేళ్ళు !!

- Advertisement -

ఒక్క సారి ఫ్లాష్ బ్యాక్ కి వెళితే నారా వంశం లో నుంచి కూడా హీరోలు రాగలరూ వచ్చి ప్రూవ్ చేసుకోగాలరూ అనిపించిన కుర్రాడు నారా రోహిత్. సరిగ్గా ఇదే రోజు 2009 లో తన బాణం సినిమా తో తెలుగు తెర కి పరిచయం అయిన మనోడు చైతన్య దంతులూరి ని డైరెక్టర్ గా తెలుగు సినిమా లో అడుగుపెట్టే చాన్స్ కూడా ఇచ్చాడు. 

ఆ సినిమా పెద్ద విజయం సాధించాక పోయినా కమర్షియల్ పంథా కి తాను పూర్తి వ్యతిరేకం అని రోహిత్ మొదటి సినిమా తోనే చెప్పెసినట్టు అయ్యింది. 

నెమ్మదిగా అంచెలు అంచెలుగా ఎదుగుతూ అడపా దడపా విజయాలు అందుకుంటూ వచ్చాడు రోహిత్. తనకి ఉన్న పంథా తెలుగు లో బహుసా మరే హీరోకీ ఉండకుండా చూసుకున్న ఒకే ఒక్క హీరో రోహిత్ అనే చెప్పాలి, ఎందుకంటే ఒక్కటంటే ఒక్క కమర్షియల్ సినిమా కూడా ఈ గ్యాప్ లో చెయ్యలేదు అంటే అసలు ఎవరైనా నమ్మగలరా? సోలో – ప్రతినిధి – రౌడీ ఫెలో – అసుర.. ఇవన్నీ కమర్షియల్ గా సక్సెస్ లు పైగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అందుకే రోహిత్ ప్రత్యేకత ఉన్న హీరోగా వెలిగిపోతున్నాడిప్పుడు. 

నిర్మాత గా కూడా మారి  ఆరన్ మీడియా వర్క్స్ సంస్థను ప్రారంభించి నలదమయంతి అనే చిత్రాన్ని నిర్మించాడు రోహిత్. ఇంతకీ విషయం మీకు ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది. సారు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆరు సంవత్సరాలనమాట, సో ఇంకా మంచి వినూత్న సినిమాలు తీస్తూ కమర్షియల్ గా హిట్ కొట్టాలంటే ఫార్ములా మాత్రమే అవసరం లేదు అని నిరూపించాలి అని కోరుకుందాం ఆల్ దీ బెస్ట్ రోహిత్ బాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -