Monday, May 20, 2024
- Advertisement -

శభాష్ నిఖిల్……. రియల్ హీరో అనిపించావ్…… నిజాలు మాట్లాడావ్

- Advertisement -

పబ్లిసిటీతోనే బ్రతికే సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మీడియా మాయలో కొట్టుకుపోవాలనుకోలేదు. సినిమా హీరోనే అయినప్పటికీ గ్రాఫిక్స్ స్వర్గంలో… కలల్లో తేలియాడాలనుకోలేదు. నిజాలు చూద్దామనుకున్నాడు. నిజాయితీగా మాట్లాడాడు.

కిరాక్ పార్టీ ప్రమోషన్స్ కోసం గుంటూరు వెళ్ళిన నిఖిల్ మీడియా గ్రాఫిక్స్‌లో కనిపించిన అద్భుత అమరావతిని నిజంగా ఎలా ఉందో చూద్దామని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తాను చూసిన నిజాన్ని నమ్మలేకపోయాడు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. అంతా మాయ. ఏవో చిన్న చిన్న పునాదులు తప్పితే నిర్మాణాలు, గ్రాఫిక్స్ బొమ్మల్లో చూపించిన అందాలు ఏమీ లేవు. అదే విషయాన్ని నిజాయితీగా చెప్పేశాడు నిఖిల్. తన జీవితంలో తాను అమరావతిని చూడలేనని చెప్పేశాడు. పచ్చ బ్యాచ్ మాయా ప్రపంచాన్ని బట్టలూడదీసి నగ్నంగా చూపించాడు.

ఇక వైఎస్ జగన్‌ని రియల్ హీరో అని నిఖిల్ ప్రశంశించడం కూడా నిజాయితీగా చెప్పినదే. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సర్వేలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ అత్యంత ప్రభావశీల వ్యక్తులలో జగన్ నంబర్ ఒన్ స్థానంలో నిలిచాడు. కెసీఆర్, చంద్రబాబు, వెంకయ్యనాయుడులాంటి సీనియర్ మోస్ట్ నాయకులను కాదని జగన్‌కే ప్రజలు ఎందుకు పట్టం కట్టారు?

ఎందుకంటే జగన్ రాజకీయాల్లో నిజాయితీ ఉంది కాబట్టి. పార్టీ స్థాపించిన నాటి నుంచీ ఫిరాయించిన ప్రతి ఎమ్మెల్యే, ఎంపి చేత రాజీనామాలు చేయించాడు. ఫాం హౌస్ రాజకీయాలు చేయలేదు. టైం పాస్ పాలిటిక్స్ అసలే కాదు. చంద్రబాబులా మీడియా ప్రచార పటాటోపం పాలిట్రిక్స్ కూడా చేయలేదు. ప్రతిక్షణం ప్రజల మధ్యనే ఉన్నాడు. దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడిని, జగన్‌కి తన అనుభవం అంత వయసులేదు అని చెప్పుకునే చంద్రబాబే……..ఈ రోజు ప్రత్యేక హోదాతో సహా చాలా విషయాల్లో తన అడుగుజాడల్లో నడిచేలా చేసుకున్నాడు జగన్. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇప్పుడు జగన్‌లో హీరోనే చూస్తున్నారు అన్నది నిజం. టిడిపి కంచు కోటలు అని చెప్పుకునే నియోజకవర్గాల్లో కూడా ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజా సందోహమే అందుకు ప్రబల సాక్ష్యం.

మామూలుగా అయితే మన టాలీవుడ్ హీరో, ఇండస్ట్రీ పెద్దలు కూడా వ్యక్తిగత స్వార్థం చూసుకుంటూ అధికారంలో ఉన్న భజన చేస్తూ అభిమానిస్తున్న అభిమానులను మోసం చేస్తూ ఉంటారు. కానీ నిఖిల్ మాత్రం ఇంతకు ముందు హోదాతో సహా చాలా విషయాల్లో నిజాయితీగా స్పందించాడు. ఇప్పుడు అమరావతి, వైఎస్ జగన్‌ల విషయంలో కూడా స్వార్థం చూసుకోకుండా, అధికారంలో ఉన్నారా? లేరా? అన్న విషయాన్ని పట్టించుకోకుండా నిజాయితీగా మాట్లాడడం మాత్రం గొప్ప విషయమే అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. అధికారంలో ఉన్న వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే నష్టపోతానని తెలిసి కూడా నిజాలు చెప్పినందుకు నిఖిల్‌ని మనం కూడా అభినందించాల్సిందే. అప్పుడే ఇతరులు కూడా సమాజం పట్ల బాధ్యతగా స్పందించే అవకాశాలు ఉంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -