జ్యోతిక శ్రమ మాములుగా లేదు గా?

- Advertisement -

‘నాచియార్’ అనే సినిమా తర్వాత సౌత్ స్టార్ జ్యోతిక మళ్ళీ ‘జాక్ పాట్’ సినిమాతో మళ్ళీ పోలీస్ అవతారం ఎత్తింది. జ్యోతిక మరియు రేవతి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని విడుదల చేశారు దర్శకనిర్మాతలు. తమిళ ట్రైలర్ కన్నా ఒక్క రోజు ఆలస్యం గా తెలుగు వర్షన్ ని ఈ విడుదల చేసారు. కేవలం 2 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తే సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ కామెడీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది అని తెలుస్తోంది.

జ్యోతిక మరియు రేవతి కాసేపు పోలీస్ ఆఫీసర్ లుగా, కాసేపు డాక్టర్ అవతారం లో కూడా కనిపించారు. ఇద్దరూ క్రిమినల్స్ గా మారి గ్యాంగ్ స్టర్ ల ఆట కట్టిస్తారని తెలుస్తోంది. ‘గుళేబాకావాలి’, ‘కాతాడి’ వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన కళ్యాణ్ ఈ సినిమా కి కూడా దర్శకత్వం వహించారు. ఆసక్తికరం అంశం ఏంటి అంటే ఈ సినిమా ని తమిళం తో పాటు సమానం గా తెలుగు లో కూడా విడుదల చేయాలి అని చూస్తున్నారు నిర్మాతలు. అంతే కాకుండా అందరి కన్నా భిన్నం గా ఉండాలి అని జ్యోతిక ఈ సినిమా లో చేసిన స్టంట్స్ అన్నీ డూప్ సాయం లేకుండా ఓన్ గా చేశారట. మరి ఇంత శ్రమ పడిన జ్యోతిక ని విజయం వరిస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

యోగి బాబు, రాజేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, ఆనంద్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాని 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -