జాక్ పాట్ రివ్వూ

- Advertisement -

ప్రముఖ హీరోయిన్ జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక.. మంచి కంటెంట్ ఉన్న కథలతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ్ లో జాక్ పాట్ అనే కామెడీ ఎంటెర్టైనెర్ తో హిట్ అందుకున్న జ్యోతిక అదే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ శుక్రవారం వచ్చారు. మరి జ్యోతిక జాక్ పాట్ ఎలా ఉందో తెలియాలి అంటే ఈ సమీక్ష లోకి వెళ్లాల్సిందే.

కథ : కొన్నేళ్లు క్రితం ఓ పాల వాడికి తన ఇంటి పెరట్లో అక్షయ పాత్ర దొరుకుతుంది. దాని కారణంగా ఆ పాల వాడు చాలా డబ్బులు గడిస్తాడు. ఐతే అనుకోకుండా కొందరు బందిపోట్లు కారణంగా ఆ పాల వాడి దగ్గర నుంచి ఆ అక్షయ పాత్ర చేజారి ఒక నదిలో పడిపోతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక అది వచ్చి విలన్ ఆనంద్ రాజ్ ఇంట్లో ఉన్న గొడ్ల పాకలోకి వచ్చి చేరుతుంది. అక్షయ పాత్ర కథ దాని మహిమ తెలిసిన జ్యోతిక అలానే తన స్నేహితురాలు కం పార్టనర్ ఐనా రేవతి కలిసి విలన్ ఇంట్లో ఉన్న ఆ అక్షయ పాత్ర ని ఎలా దక్కించుకున్నారు అన్నది వెండి తెర పై చూడాల్సిందే..

- Advertisement -

విశ్లేషణ : జాక్ పాట్ కథ లో పెద్దగా ప్లాట్స్ లేకపోయినా, ఆ మైనస్ ని కామెడీ సీన్స్ తో ప్లస్ గా మార్చేశాడు డైరెక్టర్ కళ్యాణ్. తమిళంలో కామెడీ సినిమాలకి పెట్టింది పేరు గా పాపులర్ ఐన కళ్యాణ్ జాక్ పాట్ విషయం లో కూడా అదే స్టైల్ ఫాలో అయ్యాడు. లాజిక్ ని వెతకకుండా మ్యాజిక్ కోసం సినిమాలు చూసే ఆడియన్స్ కి జాక్ పాట్ బాగా నచ్చుతుంది. అలానే కథ లో ఉత్కంఠ లేని కంటెంట్ లేనప్పుడు కామెడీ కూడా పండే అవకాశాలు తక్కువ కానీ ఆ ఫీలింగ్ ని సినిమా చూసే వాళ్లకి ఏ మాత్రం కలగకుండా చిన్న చిన్న సీన్స్ తో, పంచ్ డైలాగ్స్ తో జాక్ పాట్ ని ఓ కామెడీ ఎంటెర్టైనెర్ గా రెడీ చేసాడు డైరెక్టర్ కళ్యాణ్. ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన జ్యోతిక తన పాత్రకి తగ్గట్లుగా ఒదిగిపోయారు. ఇంతవరకు జ్యోతిక లో చూడని యాక్షన్, కామెడీ యాంగిల్స్ ఈ సినిమాలో చూడొచ్చు.

ఇక జ్యోతిక కి సపోర్టివ్ రోల్ చేసిన సీనియర్ నటి రేవతి కూడా తనదైన నటన తో ఆకట్టుకున్నారు. అలానే విలన్ గా నటించిన ఆనంద్ రాజ్ డ్యూయల్ రోల్ లో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశారు. అటు డాన్ గెట్ అప్ లో ఇటు లేడీ గెట్ అప్ లో ఆనంద్ రాజ్ పండించిన కామెడీ ఆకట్టుకుంది. అలానే మొట్రాజన్, తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఇక ఆనంద్ కుమార్ కెమెరా వర్క్ ఈ సినిమా కి ప్లస్ పాయింట్. విజువల్స్ చాలా రిచ్ గా వచ్చాయి. అలానే జ్యోతిక భర్త స్టార్ హీరో సూర్య ఈ సినిమాకి నిర్మాత. నిర్మాణ విలువలు ఏ మాత్రం తగ్గకుండా తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను ముగించారు అనిపిస్తుంది. దీని వెనుక ప్రౌడక్షన్ టీం కృషి మనకి సిల్వర్ స్క్రీన్ పై ప్రతి షాట్ లో కనిపిస్తుంది. మ్యూజిక్ కి పర్వాలేదు అనేలా ఉంది కాని కథ తగ్గట్లుగానే ఉంది. అలానే ప్రముఖ రైటర్ భారతి బాబు ఈ సినిమాకు తెలుగు డైలాగ్స్ రాసారు. అవి చక్కగా కుదిరాయి.

బాటమ్ లైన్ : నవ్వులే నవ్వులు
రేటింగ్ : 3/5

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -