- Advertisement -

‘తిమ్మరాజుపల్లి టీవీ’..కిరణ్ భావోద్వేగం!

- Advertisement -

యువ నటుడు కిరణ్ అబ్బవరం నిర్మాతగా వ్యవహరిస్తున్న సస్పెన్స్ డ్రామా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ విడుదలకు సిద్ధమైంది. నూతన దర్శకుడు వి. మునిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 17, 2026న థియేటర్లలోకి రాబోతోంది. ఇటీవల జరిగిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం సినిమాపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగంగా మాట్లాడారు.

ఈ చిత్రం నాణ్యమైన కథాబలం, సాంకేతిక విలువలతో రూపొందిందని, చిన్న బడ్జెట్ సినిమాలకు ఇది ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందని కిరణ్ అబ్బవరం ప్రశంసించారు. ముఖ్యంగా వంశీకాంత్ అందించిన సంగీతం, సౌండ్ డిజైన్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.

తిమ్మరాజుపల్లి గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించారు. ఇది ఎంతో ఉత్కంఠభరితంగా, భావోద్వేగంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా విజయం కేవలం డిస్ట్రిబ్యూటర్లకే కాకుండా, ఇందులో పనిచేసిన కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా దాదాపు 50 కుటుంబాల భవిష్యత్తుకు ఎంతో కీలకమని కిరణ్ అబ్బవరం నొక్కి చెప్పారు.

1996 రాయలసీమ నేపథ్యంలో: 1996 కాలం నాటి రాయలసీమ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఒక మారుమూల గ్రామానికి మొదటి టెలివిజన్ సెట్ వచ్చినప్పుడు జరిగిన పరిణామాలు, దాని చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణ.ఈ చిత్రంలో సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరీమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ మరియు లతీష్ ముఖ్యపాత్రల్లో నటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -