Wednesday, May 15, 2024
- Advertisement -

కరోనాతో ప్రముఖ దర్శకుడు, రచయిత కన్నుమూత

- Advertisement -

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా చిత్రపరిశ్రమలో ఎందరో ప్రముఖులు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ నటుడు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ యువ రచయిత, దర్శకుడు నంద్యాల రవి కరోనాతో శుక్రవారం మృతిచెందారు. నంద్యాల రవి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు సమీపంలో సరిపల్లి (గణపవరం పక్కన). అతడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. రచయితగా పలు సినిమాలకు పని చేసిన రవి.. నాగశౌర్య, అవికా గోర్ నటించిన ‘‘లక్ష్మీ రావే మా ఇంటికి’’ మూవీతో దర్శకుడిగా మారారు.

కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్ బిల్లు కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే… సినీ నటుడు సప్తగిరి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. చివరకు ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. ప్రస్తుతం సప్తగిరితో ఓ సినిమాను చేసేందుకు కూడా కథను రెడీ చేసుకున్నారు. ఇంతలోనే కరోనా మహమ్మారి ఆయనను బలితీసుకుంది. నంద్యాల రవి మృతిపై సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

కరోనా క్రైసిస్‌ ఛారిటీ(సీసీసీ) నుంచి కూడా కొంత సహాయం అందినట్లు సమాచారం. కోవిడ్‌ను జయించి తిరిగి వస్తాడనుకున్న నంద్యాల రవి చికిత్స పొందుతూనే మరణించడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన అకాల మరణం పట్ల ప్రముఖ నిర్మాతలు వల్లూరిపల్లి రమేష్ బాబు, కె.కె.రాధామోహన్, బెక్కెం వేణుగోపాల్.. ప్రముఖ దర్శకులు విజయ్ కుమార్ కొండా, నటుడు సప్తగిరి సహా తదితరులు సంతాపం ప్రకటించారు.

వామ్మో ఈ ముసలోడు మహా ముదురు.. 151 మంది సంతానం.. 17వ పెళ్లికి సిద్ధం

బాలకృష్ణ తన కెరియర్లో వదులుకున్న సినిమాలివే?

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న మరో వారసురాలు.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -