Saturday, May 4, 2024
- Advertisement -

ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌విభూష‌న్‌ కావాలా? ఇచ్చేస్తాం.

- Advertisement -

ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌విభూష‌న్ కావాలా? ఇచ్చేస్తాం. కానీ కొంత ఖ‌ర్చ‌యిత‌ది. వాటిని భ‌రిస్తానంటే మీకు అవార్డు వ‌చ్చేసిన‌ట్టే. భార‌త ప్ర‌భుత్వ అత్యున్న‌త పుర‌స్కారాలు ఇలా అంగ‌డి స‌రుకులు అవుతున్నాయి. ఇలా కావ‌డం ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎందుకంటే అన్నీ అవార్డులు బంధువులు, చుట్టాలు, తెలిసిన వారికి, వారికి ఉప‌యోగ‌ప‌డే వారికి ఇస్తుండ‌డంతో అదే భావించి ఓ పోలీస్ అధికారి ఈ విధంగా ప‌ద్మ‌శ్రీ అవార్డు ఇప్పిస్తాం.. రూ4 కోట్లు ఇవ్వ‌మ‌ని అడిగాడు.

వాస్త‌వంగా జ‌రుగుతున్న‌దే అత‌డు చూపించాడు. ఇత‌డు బ‌హిర్గ‌త ప‌డ్డాడు. అవార్డు క‌మిటీలు ఈ విధంగా బాహాటంగానే చేస్తున్నారు. అయితే ఇలాంటి వివ‌క్ష ఇంకా భార‌త అత్యున్న‌త పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌పైకి ఇంకా రాలేదు. వాటికి కూడా త్వ‌ర‌లో ఈ జ‌బ్బు ప‌ట్టొచ్చు.

వివిధ రంగాల్లో విశేషమైన సేవ, పరిజ్ఞానం, ప్రత్యేకతను కలిగి ఉన్న వారికి ప్ర‌తియేటా భారత ప్రభుత్వం ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తుంది. అయితే ఈ అవార్డు ఓ చోట విక్రయానికి వచ్చింది. అది కూడా తక్కువ ధరలోనే. కేవలం రూ.4 కోట్లకే! చట్టం- న్యాయాన్ని కాపాడాల్సిన ఓ పోలీసు అధికారి ఈ చర్యకు పాల్పడ్డాడు. డబ్బు కోసం మోసాలకు పాల్పడి పౌర పురస్కారాన్ని పలుచన చేశాడు.

నెల్లూరులోని గూడూరు పట్టణం సొసైటీ ప్రాంతానికి చెందిన కాకర్ల శేషారావు గుంటూరు సీసీిఎస్ పోలీస్‌స్టేషన్‌లో సీఐగా పని చేస్తున్నాడు. అత‌డికి రాజకీయంగా ఢిల్లీస్థాయిలో పలుకుబడి ఉందని కొంతకాలంగా త‌న సొంత జిల్లా నెల్లూరు, తాను పని చేస్తున్న గుంటూరు జిల్లాలోనూ ప్రచారం చేసుకున్నాడు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలందించిన రైతులకు ఇచ్చే పద్మశ్రీ అవార్డులను ఇప్పిస్తానని నమ్మబలికి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. ఇలా నెల్లూరు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అమాయక ప్రజల నుంచి భారీ మొత్తంలో దండుకున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు ఇప్పిస్తానని ఓ రైతు నుంచి రూ.4 కోట్లు పైనే వసూలు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు గుంటూరు సీసీఎస్ లో పని చేస్తున్న సీఐ కాకర్ల శేషారావు – ఆయన కుటుంబ సభ్యులను గూడూరు ఒకటో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -