Saturday, May 4, 2024
- Advertisement -

‘కృష్ణార్జున యుద్ధం’తో నాని ఇచ్చే సందేశ‌మేమిటి?

- Advertisement -

వ‌రుస‌గా విజ‌యాలతో దూసుకుపోతున్న న్యాచుర‌ల్ స్టార్ నానికి నిర్మాత‌గాను మంచి బోణి ల‌భించింది. తొలిసారి వాల్ పోస్ట‌ర్ సినిమా అనే బ్యాన‌ర్‌ను ప్రారంభించి నిర్మాత‌గా మారి నాని ‘అ!’ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో తీసి సూప‌ర్‌హిట్ సినిమా చేశారు. ఇప్పుడు నాని త‌న సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేస్తున్నాడు.

రెండు విభిన్నమైన పాత్ర‌ల్లో నాని క‌నిపించ‌నున్నాడు. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో న‌టిస్తున్న నాని ఈ సినిమాతో ప్రేక్ష‌కులకు సందేశ‌మివ్వ‌నున్నాడని స‌మాచారం. నాని ఒక పాత్ర ఊర మాస్‌గా తిరుప‌తిలో ఉంటుంటే క్లాస్ పాత్ర‌లో మ‌రో నాని ఇటలీలో ఉంటాడు. తిరుప‌తిలో ఉన్న నాని కిడ్నాపులు చేస్తాడ‌ని స‌మాచారం. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరింది. ఏప్రిల్ 12వ తేదీన సినిమాను విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. అయితే ఈ సినిమాతో నాని, గాంధీ ఓ సామాజిక సందేశం ఇవ్వాల‌ని చూస్తున్నారు. ఉమెన్ ట్రాఫికింగ్.. కిడ్నాపింగ్ గురించి కీల‌క‌మైన విష‌యాలు చెప్ప‌బోతున్నారు. ఈ క‌థ కూడా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ మీదే జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -