ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథను యాత్ర అనే పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైఎఆర్ పాత్రలో మళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. వైఎస్ఆర్ పాత్రలో మమ్మూట్టి బాగా నటించారని ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డెట్ బయటికి వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు,వైసీపీ అధినేత వైఎస్ జగన్ రానున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిబ్రవరి 1వైజాగ్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.వైఎస్ జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ కూడా ఈ ఫంక్షన్‌కు రానున్నట్లు సమాచారం. వైఎఆర్ చేపట్టిన పాదయాత్రకు సంబంధించిన కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో వైఎస్ విజయమ్మగా బాహుబలి యాక్టర్ ఆశ్రిత వేముగంటి నటించింది. వైఎస్ రాజారెడ్డిగా జగపతి బాబు నటించారు.జగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడంతో ‘యాత్ర’ సినిమాకు బజ్ పెరగడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు
- నీట్ పేపర్ లీక్ ప్రకంపనల వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- రాజ్యసభ ముందుకు ‘వందేమాతరం’ బిల్లు..
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు గడువు కోరిన కేంద్రం…
- మళ్లీ సీరియల్స్ లోకి అవికా?
- ‘నా ఇన్సూరెన్స్ డబ్బులతో డాడీకి ట్రీట్మెంట్ చేయించు మమ్మీ’
