- Advertisement -

ఘోరం..22 ఏళ్లకే 6వ సారి గర్భం!

- Advertisement -

బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, పట్టింపులు ఒక మహిళ ప్రాణాల మీదకు ఎలా తెస్తాయో చూపించే అత్యంత బాధాకరమైన సంఘటన రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చింది. కేవలం 22 ఏళ్ల వయసులోనే ఒక యువతి ఆరోసారి గర్భం దాల్చడం, నిరంతర ప్రసవాల కారణంగా ఆమె ఆరోగ్యం అత్యంత క్షీణించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

రాజస్థాన్‌కు చెందిన సదరు యువతికి చట్టబద్ధమైన వయసు రాకముందే పెద్దలు బాల్య వివాహం జరిపించారు. వివాహం అయినప్పటి నుండి ఆమెకు వరుసగా ఐదుగురు సంతానం కలిగారు. ప్రస్తుతం ఆమెకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. చిన్న వయసులోనే ఐదుగురు పిల్లలకు జన్మనివ్వడం వల్ల ఆమె శరీరం తీవ్రంగా బలహీనపడింది.

ఇప్పటికే ఒక కొడుకు ఉన్నప్పటికీ, వంశోద్ధారకుడిగా ఇంకొక అబ్బాయి కూడా ఉండాలనే విపరీతమైన కోరికతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు యువతిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఆమె శరీరం సహకరించకపోయినా, ప్రాణాల మీదకు వస్తుందని తెలిసినా వినకుండా, మరో అబ్బాయి కోసమే అంటూ ఆమెకు బలవంతంగా ఆరోసారి గర్భం వచ్చేలా చేశారు.

వరుస ప్రసవాలతో సదరు మహిళ అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం తీవ్రమైన రక్తహీనత , శారీరక బలహీనతతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. ఆమెను పరీక్షించిన వైద్యులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇంత చిన్న వయసులో ఆరోసారి గర్భం దాల్చడం అత్యంత ప్రమాదకరం. ఈ గర్భం ఆమె ప్రాణాలకే ముప్పు . ప్రసవ సమయంలో ఏదైనా తేడా వస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అని డాక్టర్లు హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -