- Advertisement -

బైక్ తీయనందుకు..టెన్త్ విద్యార్థిపై దాడి!

- Advertisement -

వనపర్తి జిల్లాలో టెన్త్ తరగతి విద్యార్థిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ శివారులోని కోటి లింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మహాశివరాత్రి జాగరణ కోసం ఆలయానికి వచ్చిన భాను ప్రకాష్ అనే విద్యార్థి టీ స్టాల్ వద్ద బైక్‌పై కూర్చుని టీ తాగుతున్నాడు.

అప్పటికే అక్కడికి వచ్చిన కొంతమంది యువకులు బైక్‌ను తీసేయాలని చెప్పినట్లు సమాచారం. అయితే ఆ బైక్ తనది కాదని భాను ప్రకాష్ చెప్పినా వారు వినకుండా అతనిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో యువకులు విద్యార్థిని కొట్టి గాయపరిచారు.

ఈ దాడిలో భాను ప్రకాష్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన యువకుల వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -