- Advertisement -

ఎన్నిక‌ల్లో పోటీ కోసం కూతురిని చంపిన తండ్రి!

- Advertisement -

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో దారుణం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కన్న కూతురినే హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. ఈ బాలిక హత్య కేసును నిజామాబాద్ పోలీసులు ఛేదించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లలు ఉండకూడదనే నిబంధన అడ్డుగా మారడంతో, తండ్రే ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్కెడ్ తాలూకా కేరూర్ గ్రామానికి చెందిన పాండు రంగ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాడు. అయితే అతనికి ముగ్గురు పిల్లలు ఉండటంతో అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సర్పంచ్ గణేష్ షిండే సలహాతో తన పెద్ద కూతురిని హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినా, అనుమానం రావడంతో పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.

సాంకేతిక ఆధారాలు, వాంగ్మూలాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, బాలిక తండ్రి పాండు రంగతో పాటు గ్రామ సర్పంచ్ గణేష్ షిండేను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -