- Advertisement -

తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కూతురు!

- Advertisement -

హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం అదృశ్యమైన మహిళ కేసు దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. జవహర్ నగర్‌కి చెందిన అంజూ అనే మహిళ ఏడాది క్రితం కనిపించకుండా పోవడంతో, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

తాజాగా జరిగిన విచారణలో సంచలన విషయం బయటపడింది. అంజూ చిన్న కూతురు ఇషిక, ఆమె భర్త కుమార్ కలిసి అంజూను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో ఇషిక పోలీసుల ఎదుట నిజం ఒప్పుకుని, తల్లిని చంపిన తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టినట్లు తెలిపింది.

ఈ సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, సంఘటనా స్థలంలో తవ్వకాలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ దారుణం ప్రజలను షాక్‌కు గురిచేసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -