- Advertisement -
శంషాబాద్లో ఒక యువకుడి జేబులో మొబైల్ ఫోన్ పేలిన ఘటన కలకలం రేపింది. నమాజ్ ముగించుకుని బయటకు వచ్చిన 25 ఏళ్ల మసూద్ అనే యువకుడి జేబులో ఉన్న వివో మొబైల్ ఫోన్ అకస్మాత్తుగా పేలినట్లు సమాచారం.
ఫోన్ ఒక్కసారిగా వేడెక్కి పొగలు రావడంతో అప్రమత్తమైన మసూద్ వెంటనే దాన్ని జేబులో నుంచి తీసి రోడ్డుపై పడేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. పేలుడు కారణంగా అతనికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.
ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొబైల్ బ్యాటరీలో లోపం లేదా అధిక వేడి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
