విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనితీరు అధ్బుతం..ఆయన్ని చూసి గర్విస్తున్నా ఇది లోకేష్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు గుప్పించిన తీరు. కానీ తీరా లోకేష్ సార్ పనితీరు చూస్తుంటే అంతా నవ్వకమానరు.
ఎందుకంటే ఏపీలో ఈ విద్యాసంవత్సరంలో 4,750 ప్రభుత్వ పాఠశాలల్లో సున్నా అడ్మిషన్లు వచ్చాయి. ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పడిపోతూనే ఉంది. 2025-26 విద్యాసంవత్సరంలో సుమారు 4,750 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా కొత్తగా చేరకపోవడం ఆందోళనకర విషయంగా చెబుతున్నారు విద్యావేత్తలు.
ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు 4,750 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరలేదు. గత విద్యాసంవత్సరం ఒకటో తరగతి నుండి ఆరో తరగతిలో వరకు 3,200 పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరలేదు. గతేడాది జూన్ చివరి నాటికి సుమారు 35 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు విద్యాశాఖ అధికారులు.
కానీ విద్యా సంవత్సరం ముగిసే నాటికి ఆ సంఖ్య 32.50 లక్షలకు పడిపోయిందని తెలిపారు విద్యాశాఖ అధికారులు.
