ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమైంది. 15 నెలల్లోనే రూ.6,072 కోట్లు రాబట్టేలా ప్రణాళిక సిద్ధం చేసిన కూటమి సర్కార్…పండగ పూట నుండే ప్రజల జేబులకు చిల్లు పెట్టేందుకు రెడీ అవుతోంది.
కరెంట్ ఛార్జీల పెంపుపై మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. 200 యూనిట్లు వాడుకునే ప్రతి కుటుంబానికి నెలకు రూ.400 విద్యుత్ ఛార్జీల భారాన్ని చంద్రబాబు మోపుతున్నాడన్నారు. గ్యాస్ బండకు నెలకు రూ.200 ఆదా చేస్తూ ఇదే దీపావళి కానుక అని చంద్రబాబు గొప్పగా చెబుతున్నాడు…
ఇది ప్రజల నెత్తిన బండవేయడమే అన్నారు. ప్రజలకు ఇస్తామని చెప్పిన ఒక్క హామీ నెరవేర్చలేదు…చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా కరెంటు ఛార్జీలు పెంచడానికి వీల్లేదని మేం డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
164 సీట్లు రావడంతో చంద్రబాబుకు షాక్ కొట్టింది…అసలు అధికారంలోకి వస్తాననే చంద్రబాబు ఊహించలేదు అన్నారు. ప్రజలు తనకు షాక్ ఇచ్చినందుకు రిటర్న్ షాక్ గా కరెంట్ ఛార్జీలు పెంచాడు..చంద్రబాబు దగ్గర యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఒకలా మాట్లాడటం ఎన్నికలయ్యాక ఇంకోలా పాలన చేయడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు.
టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోదు…రాష్ట్ర ప్రజల జీవితాలను చీకట్లోకి నెడుతుందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నేడు వచ్చిందన్నారు. గతంలో బషీర్ బాగ్ స్థాయిలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం రావాల్సిన అవసరం ఉందన్నారు శివప్రసాద్ రెడ్డి.
