- Advertisement -

ఇసుక కుంభకోణం…బాబుపై మరో కేసు

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుపై లెఫ్ట్ రైట్‌గా కేసులు నమోదవుతున్నాయి. మధ్యంతర బెయిల్‌పై వచ్చిన చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణంలో కేసు నమోదైంది. ఏపీ ఎండీసీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు ఏపీ సీఐడీ అధికారులు. ఏ1గా పీతల సుజాత,ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేమి ఉమ పేర్లు నమోదయ్యాయి. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లందని ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది.

వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం, అంగళ్లు కేసు, ఏపీ లిక్కర్ స్కాం ఇలా వరుస కేసుల్లో చంద్రబాబు బుక్కవుతున్నారు. తాజాగా ఇసుకు మరక చంద్రబాబుకు అంటగా ఆయన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని చూసి ఉండడు.

అలాగే ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టినందుకు తెలంగాణ టీడీపీ హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు, ఇతర టీడీపీ కార్యకర్తలపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించడం, ట్రాఫిక్ రద్దీ, రహదారిపై ఇబ్బంది కలిగించడం మరియు ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకోకపోవడం వంటి అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చినా చంద్రబాబుకు రిలీఫ్ మాత్రం దక్కడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -