Saturday, May 4, 2024
- Advertisement -

బీసీ వార్..సంజయ్ వర్సెస్ ఈటల మధ్యలో లక్ష్మణ్!

- Advertisement -

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను టార్గెట్ చేస్తూ బీజేపీ వేసిన ఎత్తుగడ ఇప్పుడు ఆ పార్టీకే తలనొప్పిగా మారింది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించారు ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా. అయితే బీసీ సీఎం ఎత్తుగడ సంగతి అలా ఉంచితే ఇప్పుడు ఆ పార్టీలోనే అంతర్గతంగా వార్ మొదలైంది.

బీసీ నేతలు లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్‌ ఇలా ఎవరికి వారే సీఎం పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అవసరమైతే వారి వారి నియోజకవర్గాల్లో తమకు పోటీ ఉన్న నేతలను ఓడించేంతలా రగిలిపోతున్నారు. వాస్తవానికి సంజయ్‌ని బీజేపీ చీఫ్ పదవి నుండి తొలగించి కిషన్ రెడ్డిని ఆ స్థానంలో కూర్చోబెట్టిందే బీసీ నేతలు. బండికి వ్యతిరేకంగా అధిష్టానానికి పదే పదే కంప్లైంట్ చేసి సంజయ్‌కు కళ్లెం వేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక అప్పుడే బీజేపీ రెండుగా చీలిపోయింది. సంజయ్‌ని తొలగించడాన్ని తప్పుబడుతూనే బహిరంగంగా చెప్పకపోయినా ఆయన వెంటే ఇప్పటికి కొంతమంది నేతలు నడుస్తున్నారు.

ఇక ప్రధానంగా సీఎం రేసులో బండి సంజయ్, ఈటల రాజేందర్ పేర్లు వినిపిస్తుండగా తానేమీ తక్కువా అంటూ లక్ష్మణ్ సైతం తన ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక బీజేపీ వస్తే తానే సీఎం అవుతానని భావించిన కిషన్ రెడ్డికి అమిత్ షా ప్రకటనతో చల్లబడగా బీసీ నేతల్లో మాత్రం పైకి తామంతా ఒకటేనని చెబుతూనే లోలోపల ఎవరి వర్గాన్ని వారే తయారు చేసుకుంటున్నారు. దీంతో ఈ బీసీ పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను ఇబ్బంది పెట్టడం ఏమో గానీ బీజేపీకి మాత్రం నష్టం కలగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -